గత ప్రపంచ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన జట్టు వన్డే ప్రపంచ కప్ 2023(ODI World Cup 2023) లో ప్రవేశించడానికి ముందు పెద్ద షాక్‌ను ఎదుర్కొంది. వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ (England vs New Zealand) తలపడనున్నాయి. ఈ ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్ అక్టోబర్ 5న జరగనుంది. ఆ మ్యాచ్‌కు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) అందుబాటులో ఉండడం లేదు. నిజానికి ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభంలోనే విలియమ్సన్ మోకాలి గాయంతో బాధపడ్డాడు. అప్పటి నుంచి కేన్ మామ దూరమయ్యాడు. ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన విలియమ్సన్ ఇప్పటికీ పూర్తి ఫిట్ నెస్ సాధించలేకపోయిన సంగతి తెలిసిందే.
ఈ విధంగా, న్యూజిలాండ్ జట్టు శాశ్వత కెప్టెన్ కేన్ విలియమ్సన్ లేకుండా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో తలపడనుంది. వన్డే ప్రపంచకప్‌లో అత్యంత నిలకడగా ఉన్న జట్లలో న్యూజిలాండ్ ఒకటి. భారత గడ్డపై ప్రపంచకప్ గెలవాలని కివీస్ క్రికెటర్లు కలలు కంటున్నారు. అందువల్ల జట్టులో కేన్ అందుబాటులో ఉండటం తప్పనిసరి.
విలియమ్సన్ గత ఆరు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇవన్నీ ఉన్నప్పటికీ, అతను 15 మందితో కూడిన ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. విలియమ్సన్ మైదానంలో లేకపోయినా వరల్డ్ కప్ లాంటి పెద్ద ఈవెంట్‌లో కీలక పాత్ర పోషిస్తాడని టీమ్ మేనేజ్‌మెంట్‌కు బాగా తెలుసు. కాబట్టి, అతను ప్రపంచ కప్ జట్టులో మాత్రమే కాకుండా కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. కానీ కేన్ ఫిట్ నెస్ లేకపోవడంతో ఆరంభంలోనే జట్టు ఒత్తిడిలో ఉంటుంది.
ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లో పాకిస్థాన్‌తో న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో విలియమ్సన్ ఆడాడు. పాకిస్థాన్ మ్యాచ్‌లో విలియమ్సన్ బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే ఆడతాడని జట్టు ఇదివరకే ప్రకటించింది. అయితే, ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు భారీ టార్గెట్ అందించినా..కివీస్ టీం ఏమాత్రం టెన్షల్ లేకుండా ఆడి, ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ కీలక ఇన్నింగ్స్ ఆడి, హాఫ్ సెంచరీ చేశాడు. సోమవారం దక్షిణాఫ్రికాతో జరిగే రెండో, చివరి ప్రాక్టీస్ మ్యాచ్‌లో అతను బ్యాటింగ్ చేసి ఫీల్డింగ్ కూడా చేయనున్నాడు. కోచ్ గ్యారీ స్టీడ్ మాట్లాడుతూ, ‘మేము చాలా కాలంగా విలియన్సన్‌పై దృష్టి పెట్టాం. తద్వారా త్వరగా మైదానంలోకి వచ్చాడు. ఇప్పుడు మేం అంతర్జాతీయ క్రికెట్ ఒత్తిడిని విలియమ్సన్‌పై తీసుకురావాలనుకోలేదు అంటూ తెలిపాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..