ఓటమి మమ్మల్ని కలచివేసింది- విలియమ్సన్‌

| Edited By: Srinu

Jul 15, 2019 | 2:22 PM

ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన క్రికెట్ మ్యాచుల్లో..2019 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అందరికీ గుర్తుండుపోతుంది. అసలు ఆ మ్యాచ‌ను గుర్తుచేసుకోగానే మనసులో ఒక ఉద్వేగం కలుగుతుంది. వాట్ ఏ మ్యాచ్. ఇరు జట్లు ఎక్కడా..తగ్గలేదు. ఇంతటితో చాలు అని సరిపెట్టుకోలేదు. మెట్టమొదటిసారి టైటిల్‌ను ముద్దాడటానికి ఇరు జట్లు..శక్తివంచన లేకుండా కృషి చేశాయి. కానీ అదృష్టం మాత్రం ఆతిథ్య ఇంగ్లాండ్‌నే వరించింది. ఖచ్చితంగా ఇది లక్ వల్ల వచ్చిన విజయం తప్ప మరొకటి కాదు. న్యూజిలాండ్ కూడా […]

ఓటమి మమ్మల్ని కలచివేసింది- విలియమ్సన్‌
Follow us on

ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన క్రికెట్ మ్యాచుల్లో..2019 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అందరికీ గుర్తుండుపోతుంది. అసలు ఆ మ్యాచ‌ను గుర్తుచేసుకోగానే మనసులో ఒక ఉద్వేగం కలుగుతుంది. వాట్ ఏ మ్యాచ్. ఇరు జట్లు ఎక్కడా..తగ్గలేదు. ఇంతటితో చాలు అని సరిపెట్టుకోలేదు. మెట్టమొదటిసారి టైటిల్‌ను ముద్దాడటానికి ఇరు జట్లు..శక్తివంచన లేకుండా కృషి చేశాయి. కానీ అదృష్టం మాత్రం ఆతిథ్య ఇంగ్లాండ్‌నే వరించింది. ఖచ్చితంగా ఇది లక్ వల్ల వచ్చిన విజయం తప్ప మరొకటి కాదు. న్యూజిలాండ్ కూడా వరల్డ్ కప్‌లో ఓడిపోయింది అంటే సగటు క్రికెట్ ప్రేక్షకుడి మనసు ఒప్పుకోదు.

న్యూజిలాండ్‌ వరుసగా రెండో సారి రన్నరప్‌గా నిలిచింది. కాగా ఆ జట్టు ఆటగాళ్లు మాత్రం తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. ఓటమిపై న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ స్పందిస్తూ.. ‘విజేతగా నిలిచిన ఇంగ్లాండ్‌ జట్టుకు అభినందనలు. ఈ మ్యాచ్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన సహచర సభ్యులకు ధన్యవాదాలు. మ్యాచ్‌ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. పిచ్‌లు మేం అనుకున్నదాని కంటే కొంచెం  భిన్నంగా ఉన్నాయి.  300 పైచిలుకు స్కోర్లను ఆశించాం. మ్యాచ్‌ టైగా మారడం వెనక చాలా కారణాలున్నాయి. ఇది నిజంగా దురదృష్టకరం. మ్యాచ్‌ టైగా మారటంతో మా ఆటగాళ్లు తీవ్రంగా కలత చెందారు. కానీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు’ అన్నారు.

‘ఇది కేవలం ఒక్క ఎక్స్‌ట్రా పరుగుకు సంబంధించిన విషయం కాదు. మ్యాచ్‌ మొత్తం మీద జరిగిన ప్రతి చిన్న విషయం కూడా ఈ గెలుపులో కీలక పాత్ర పోషించింది. మ్యాచ్‌లో చోటు చేసుకున్న కొన్ని అంశాలు న్యూజిలాండ్‌కు దురదృష్టకర పరిణామాలుగా మారాయి. ఏది ఏమైనా ఈ ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’ అన్నారు విలయమ్సన్‌.