బౌన్సర్ దాటికి మైదానంలో కుప్పకూలిన క్రికెటర్..! అతడి బర్త్‌ డే సందర్భంగా స్పెషల్ స్టోరీ..

|

Jul 03, 2021 | 7:27 PM

ఆటలు ఆడేటపుడు కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతాయి. ప్రాణాలు కూడా పోతాయి. దీనికి క్రికెట్ ఏమి మినహాయింపు కాదు. చరిత్రలో భయపెట్టే

బౌన్సర్ దాటికి మైదానంలో కుప్పకూలిన క్రికెటర్..! అతడి బర్త్‌ డే సందర్భంగా స్పెషల్ స్టోరీ..
Ewen Chatfield
Follow us on

ఆటలు ఆడేటపుడు కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతాయి. ప్రాణాలు కూడా పోతాయి. దీనికి క్రికెట్ ఏమి మినహాయింపు కాదు. చరిత్రలో భయపెట్టే సంఘటనలు చాలా జరిగాయి. అలాంటి ఓ ఘటన జూలై 3, 1950 న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఈ ప్రమాదంలో బ్యాట్స్‌మెన్ తల పగిలింది. నాలుక వాచిపోయింది. హార్ట్ బీట్ ఆగిపోయింది. శ్వాస తీసుకోవడం కష్టమైంది. అయితే ఈ రోజు అతడి పుట్టిన రోజు.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరు.. అతడు బతికాడా లేదా తెలుసుకుందాం.

అతడు ఎవరో కాదు న్యూజిలాండ్ క్రికెటర్ ఎవెన్ చాట్ఫీల్డ్. ఈ టెస్ట్ మ్యాచ్ 1974-75 సంవత్సరంలో ఆక్లాండ్‌లో జరిగింది. అప్పట్లో బ్యాట్స్‌మెన్స్ హెల్మెట్‌ను ఉపయోగించేవారు కాదు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయింది. జియోఫ్ హోవర్త్‌తో కలిసి బ్యాటింగ్ చేయడానికి అవెన్ 11 వ స్థానంలో వచ్చాడు. అప్పుడు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ పీటర్ లావర్.. చాట్ఫీల్డ్కుపై బౌన్సర్ ఆయుధాన్ని ప్రయోగించాడు. బంతి చాట్‌ఫీల్డ్ బ్యాట్ అంచుని తాకి పుర్రెను బలంగా ఢీ కొట్టింది. వెంటనే అతడు శ్వాస తీసుకోవడం ఆపేశాడు. నాలుక వాపు వచ్చింది. అవెన్ హృదయ స్పందన కాసేపు ఆగిపోయింది. వెంటనే మరో ఆటగాడు అతడి గుండెను ప్రెస్ చేయడం మొదలెట్టాడు. తన బౌన్సర్ ఫలితాన్ని చూసి లావర్ ఆశ్చర్యపోయాడు.

కొంత సమయం తర్వాత అవెన్ చాట్‌ఫీల్డ్ తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాడు. ఈ సంఘటన జరిగిన కొద్ది సంవత్సరాలకే హెల్మెట్ల వాడకం ప్రారంభమైంది. చాట్‌ఫీల్డ్ కెరీర్‌కు సంబంధించినంతవరకు న్యూజిలాండ్ తరఫున 43 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. దీనిలో అతను 123 మంది బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కి పంపించాడు. మూడుసార్లు ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన రికార్డును కలిగి ఉన్నాడు. అదే సమయంలో 114 వన్డే మ్యాచ్‌ల్లో అతని పేరు మీద 140 వికెట్లు ఉన్నాయి. ఉత్తమ ప్రదర్శన 34 పరుగులకు 5 వికెట్లు. అవెన్ తన కెరీర్‌లో 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 587 వికెట్లను సాధించాడు. ఈ సమయంలో 27 సార్లు అతను ఒక ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయగా 8 సార్లు అతను పది లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. 171 లిస్ట్ ఎ మ్యాచ్‌లలో అవెన్ 222 బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశాడు.

Virat Kohli : ఎంఎస్ ధోని తర్వాత విరాట్ అత్యత్తమ కెప్టెన్..! డబ్ల్యుటీసీ ఫైనల్‌ ఓడిపోవడం అతని తప్పు కాదంటున్న..

Villagers Variety Protest: కొద్దిపాటి వర్షానికే చిత్తడిగా రహదారులు.. రోడ్డుపై నాట్లు వేసి గ్రామస్తుల వినూత్న నిరసన

Magic Lake Video:స్పాటెడ్ లేక్..సమ్మర్ లో నీళ్లు ఉండటమే కష్టం అలాంటిది రంగులు విరజిమ్మే సరస్సు…ఎక్కడంటే..?