IND vs NZ: న్యూజిలాండ్ టీంకు బ్యాడ్ న్యూస్.. మూడో మ్యాచ్‌ నుంచి విలియమ్సన్ ఔట్.. ఎందుకంటే?

కేన్ విలియమ్సన్ నిష్క్రమణ తర్వాత భారత్‌తో జరిగే మూడో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు టిమ్ సౌథీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. భారత్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో విలియమ్సన్ 61 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

IND vs NZ: న్యూజిలాండ్ టీంకు బ్యాడ్ న్యూస్.. మూడో మ్యాచ్‌ నుంచి విలియమ్సన్ ఔట్.. ఎందుకంటే?
Ind Vs Nz 3rd T20i Kane Williamson

Updated on: Nov 21, 2022 | 12:11 PM

భారత్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌కు న్యూజిలాండ్ కెప్టెన్ కెన్ విలియమ్సన్ దూరమయ్యాడు. విలియమ్సన్ నిష్క్రమణ కారణంగా కివీ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని జట్టు 3 మ్యాచ్‌ల టీ20ఐ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వగా, రెండో మ్యాచ్‌లో భారత్ 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో టీ20లో కివీస్‌ బ్యాట్స్‌మె‌న్స్ చేతులెత్తేసిని.. సారథి కేన్ విలియమ్సన్‌ మాత్రం ఆ జట్టు తరపున అత్యధికంగా 61 పరుగులతో నిలిచాడు. కానీ, మ్యాచ్‌ని గెలిపించలేకపోయాడు. ఇక మూడో టీ20 మ్యాచ్‌లో ఆడకపోవడంతో.. హార్దిక్ సేనకు క్లీన్ స్వీప్ చేసే అవకాశం దక్కనుంది.

మూడో మ్యాచ్‌లో సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో భారత్‌ రంగంలోకి దిగనుండగా, న్యూజిలాండ్‌ సిరీస్‌ సమం చేసేందుకు ప్రయత్నిస్తోంది. కీలక మ్యాచ్‌లో విలియమ్సన్ స్థానంలో మార్క్ చాప్‌మన్‌ను జట్టులోకి తీసుకున్నారు. అనుభవజ్ఞుడైన బౌలర్ టిమ్ సౌథీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

ఇవి కూడా చదవండి

కారణం ఏంటంటే?

విలియమ్సన్‌కు మంగళవారం నాడు డాక్టర్ అపాయింట్‌మెంట్ ఉందంట. దీని కారణంగా అతను మూడో మ్యాచ్‌కు దూరమవ్వనున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ బుధవారం జట్టులో చేరనున్నాడు. టీ20 సిరీస్ తర్వాత, రెండు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల ODI సిరీస్ జరగనుంది. ఇందులో మొదటి మ్యాచ్ శుక్రవారం ఆక్లాండ్‌లో జరుగుతుంది. విలియమ్సన్ ఆక్లాండ్‌లో జట్టుతో చేరనున్నాడు.

ఇన్‌స్టా పోస్ట్ ఇక్కడ చూడండి..

పాత గాయం తిరగబెట్టిందా..

ఈ మెడికల్ అపాయింట్‌మెంట్‌కి విలియమ్సన్ మోచేయి గాయానికి ఎలాంటి సంబంధం లేదని కోచ్ గ్యారీ స్టడ్ కూడా స్పష్టం చేశారు. విలియమ్సన్ కొంతకాలం క్రితమే ఈ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు అది మా షెడ్యూల్‌కు సరిపోలేదని కోచ్ చెప్పుకొచ్చాడు. ఆటగాళ్ల ఆరోగ్యమే మాకు ప్రధానమని, కేన్‌ను మళ్లీ ఆక్లాండ్‌లో చూడాలని ఎదురుచూస్తున్నామని చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్, ట్రై-సిరీస్‌లో ఆడిన తర్వాత చాప్‌మన్ తిరిగి జట్టులోకి వచ్చినందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాడని కోచ్ తెలిపాడు.

భారత్ భారీ విజయం..

భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది . ఇలాంటి పరిస్థితుల్లో మిగిలిన మ్యాచ్‌లు ఇరు జట్లకు కీలకంగా మారాయి. రెండో మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ 51 బంతుల్లో నాటౌట్ 111 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారత్ ఆతిథ్య జట్టుకు 192 పరుగుల లక్ష్యాన్ని అందించింది. దీనికి సమాధానంగా ఆతిథ్య జట్టు 18.2 ఓవర్లలో 126 పరుగులకు కుప్పకూలింది. న్యూజిలాండ్ తరపున కేన్ విలియమ్సన్ అత్యధికంగా 61 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..