MS Dhoni: యంగెస్ట్ అన్​‌క్యాప్డ్ ప్లేయర్ ..నయా లుక్..!

|

Oct 12, 2024 | 3:18 PM

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఎప్పుడూ మైదానంలోనే కాదు.. ఈ మధ్య బయట కూడా స్టైల్ ట్రెండ్‌సెట్టర్‌గా మారాడు. ఇటీవలే, ధోనీ తనకు బాగా తెలిసిన సెలబ్రిటీ హెయిర్‌స్టైలిస్ట్ అలీమ్ హకీమ్‌తో  స్టైలిష్ క్విఫ్ హెయిర్‌స్టైల్‌ చేయించాడు.. న్యూలుక్‌లో ధోని 25 ఏండ్ల కుర్రాడి లాగా కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు. ముఖ్యంగా హెయిర్‌స్టైలిస్ట్ హకీమ్ నాలుగు నెలల క్రితం 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో ధోనీ జుట్టుకు కూడా స్టైల్ చేశాడు.

MS Dhoni: యంగెస్ట్ అన్​‌క్యాప్డ్ ప్లేయర్ ..నయా లుక్..!
Ms Dhoni New Look
Follow us on

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఎప్పుడూ మైదానంలోనే కాదు.. ఈ మధ్య బయట కూడా స్టైల్ ట్రెండ్‌సెట్టర్‌గా మారాడు. ఇటీవలే, ధోనీ తనకు బాగా తెలిసిన సెలబ్రిటీ హెయిర్‌స్టైలిస్ట్ అలీమ్ హకీమ్‌తో  స్టైలిష్ క్విఫ్ హెయిర్‌స్టైల్‌ చేయించాడు. న్యూలుక్‌లో ధోని 25 ఏండ్ల కుర్రాడి లాగా కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు. ముఖ్యంగా హెయిర్‌స్టైలిస్ట్ హకీమ్ నాలుగు నెలల క్రితం 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో ధోనీ జుట్టుకు కూడా స్టైల్ చేశాడు.

ధోని ఎలప్పుడూ ఇలాంటి ప్రయోగాలు చేయడంలో ముందు వరుసలో ఉన్నాడు. గత ఐపీఎల్ సీజన్‌లో లాంగ్ హెర్‌తో అందరీ దృష్టిని ఆకర్షించాడు. తాజాగా మళ్లీ న్యూలుక్‌తో అందర్నీ అదరహా అనేలా చేస్తున్నాడు. ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా  సీఎస్‌కే జట్టును నిలిపిన కూల్ కెప్టెన్ స్టైలిష్ లుక్‌తో అభిమానులను మరోసారి ఆశ్చర్యపరిచాడు.

ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రాబోయే 2025 మెగా వేలం కోసం నిలుపుదల నిబంధనలపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కొత్త రిటెన్షన్ నిబంధనల వల్ల ఆ జట్టు ఓ మంచి లాభం పొందుతుంది. వారు MS ధోనిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా కొనసాగించడానికి వీలు కల్పించారు. గత ఐదు సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్‌లో పాల్గొనని భారతీయ ఆటగాళ్లను అన్‌క్యాప్డ్ హోదాలో కొనసాగించవచ్చు. ధోని ఈ నిబంధనకు అర్హులని చెప్పాలి.

MS ధోని భారత జాతీయ జట్టుకు చివరిసారిగా 2019 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో ఆడాడు. ఈ మ్యాచ్లో భారత్‌క ఓడిపోయిన సంగతి తెలిసిందే. కొత్త కొన్ని ఐపీఎల్ సీజన్లలో ధోని డెత్ ఓవర్లలో పవర్-హిటర్‌గా మారాడు. అతని ఫినిషింగ్ నైపుణ్యాలను కొత్త ఎత్తులకు పెంచాడు. రుతురాజ్ గైక్వాడ్ CSKలో నాయకత్వ బాధ్యతలను స్వీకరించడంతో, ధోని తన IPL ప్రయాణాన్ని ఉన్నత స్థాయిలో ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఈ భారత క్రికెట్ లెజెండ్ ఎప్పుడు వీడ్కోలు పలుకుతాడనేది ఇంకా తెలియాల్సి ఉంది.