అత్యాచారం ఆరోపణలతో జైలుకు.. అనంతరం బెయిల్‌పై బయటకు.. కట్‌చేస్తే.. జట్టులో చోటు దక్కించుకున్న ఐపీఎల్ మాజీ ప్లేయర్..

|

Feb 11, 2023 | 4:18 PM

స్కాట్లాండ్, నమీబియాతో జరిగే ముక్కోణపు సిరీస్ కోసం 14 మంది సభ్యులతో కూడిన నేపాల్ జట్టులో యువ స్పిన్నర్ సందీప్ లామిచానే చోటు దక్కించుకున్నాడు. మైనర్ బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో సందీప్ లామిచ్చానే జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

అత్యాచారం ఆరోపణలతో జైలుకు.. అనంతరం బెయిల్‌పై బయటకు.. కట్‌చేస్తే.. జట్టులో చోటు దక్కించుకున్న ఐపీఎల్ మాజీ ప్లేయర్..
Sandeep Lamichhane
Follow us on

Sandeep Lamichhane: స్కాట్లాండ్, నమీబియాతో జరిగే ముక్కోణపు సిరీస్ కోసం 14 మంది సభ్యులతో కూడిన నేపాల్ జట్టులో యువ స్పిన్నర్ సందీప్ లామిచానే చోటు దక్కించుకున్నాడు. మైనర్ బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో సందీప్ లామిచ్చానే జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు. నేపాల్ క్రికెట్ అసోసియేషన్ అతనిని సస్పెండ్ చేసింది. కానీ, ఇప్పుడు ఈ సస్పెన్షన్ తొలగించడంతో ట్రై-సిరీస్ కోసం జట్టులో ఎంపికయ్యాడు.

శిక్షణా శిబిరంలో సందీప్ లమిచ్చానేని కూడా చేర్చడంతో గతవారం నేపాల్‌లో నిరసనలు మొదలయ్యాయి. ట్రై సిరీస్‌ను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ముక్కోణపు సిరీస్‌ ఆడేందుకు వస్తున్న ఇరు జట్లు కూడా ఈ విషయాన్ని సూచిస్తూ ప్రకటనలు విడుదల చేయడం గమనార్హం. సందీప్ లామిచానే చట్టపరమైన ప్రక్రియ గురించి తమకు తెలుసునని క్రికెట్ స్కాట్లాండ్ శుక్రవారం తెలిపింది. క్రికెట్ స్కాట్లాండ్, పాలకమండలిగా, జట్టుగా, అన్ని రకాల దుర్వినియోగాలకు వ్యతిరేకంగా ఉంటుందని తెలిపింది.

కోర్టు ఆదేశాలను పాటించాల్సిందే..

సందీప్ లామిచ్చానే జట్టులో ఎంపికైనప్పటికీ, నేపాల్ జట్టు దేశం వెలుపల పర్యటిస్తే, కోర్టు అనుమతి తర్వాతే లామిచ్చానే పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. నేపాల్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ మేనేజర్ బ్రిటాంట్ ఖనాల్ గతంలో సందీప్ లామిచానేపై నిషేధాన్ని ఎత్తివేసినట్లు, అతను కోర్టు ఇచ్చిన అన్ని మార్గదర్శకాలు, సమయపాలనను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఈ ఆరోపణల తర్వాత సందీప్ చాలా కాలం పాటు కస్టడీలో ఉన్నాడు. విచారణ తర్వాత, కోర్టు అతనికి US $ 15,300 అంటే సుమారు రూ. 12.53 లక్షల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది.

మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..