క్రికెట్‌లో ప్రపంచ రికార్డులు సృష్టించడం ఆషామాషీ కాదు. ఎన్ని అద్బుతమైన ప్రదర్శనలు కనబరిచినప్పటికీ.. కొందరికి ఇవి అసాధ్యమే. అయితే ఇక్కడొక ప్లేయర్.. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. రేప్‌కేసులో జైలుపాలైన ఈ ఆటగాడు.. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ పేరిట ఉన్న ఆ ప్రపంచ రికార్డును కేవలం 27 మ్యాచ్‌లలోనే బద్దలు కొట్టాడు.
మార్చి 6న యూఏఈతో జరిగిన వన్డే మ్యాచ్‌లో నేపాల్ ప్లేయర్ సందీప్ లామిచానే అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు 10 ఓవర్లు బౌలింగ్ చేసి 52 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టాడు. అదేంటి దీని రికార్డు ఏముందని ఆలోచిస్తున్నారా.? అదేనండీ..! వరుసగా అత్యధిక మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క వికెట్ తీసిన వన్డే వరల్డ్ రికార్డు. ఈ రికార్డు ఇప్పటివరకు ఆస్ట్రేలియా బౌలర్ బ్రెట్‌లీ పేరిట ఉంది. ఇప్పుడు దాన్ని సందీప్ లామిచానే తిరగరాసి.. రికార్డు తన పేరిట రాసుకున్నాడు. UAEతో ఆడిన ODI మ్యాచ్‌తో అతడు వరుసగా 27 వన్డే మ్యాచ్‌లు ఆడటంతో పాటు ఒక్క వికెట్ పడగొట్టాడు. లామిచానే 2020-23 మధ్య వరుసగా 27 మ్యాచ్‌లు ఆడాడు.
ఈ మూడేళ్లలో 27 మ్యాచ్‌లు ఆడిన లామిచానే వరుసగా అత్యధిక మ్యాచ్‌లు ఆడటంతో పాటు ఒక్క వికెట్ కూడా తీసిన ప్లేయర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. కాగా గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన బ్రెట్ లీ పేరిట ఉంది. అతడు వరుసగా 26 ODIలు ఆడి ఒక్క వికెట్ పడగొట్టాడు. 2009-11 మధ్య బ్రెట్‌లీ ఈ 26 వన్డేలు ఆడాడు.