India Vs Australia 2020: యువ పేసర్‌పై ప్రశంసల జల్లు కురిపించిన హిట్ మ్యాన్.. కసిగా బౌలింగ్ చేస్తున్నాడని కామెంట్స్..

India Vs Australia 2020: భారత్, ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బ్రిస్బేన్‌లో నాలుగో టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

India Vs Australia 2020: యువ పేసర్‌పై ప్రశంసల జల్లు కురిపించిన హిట్ మ్యాన్.. కసిగా బౌలింగ్ చేస్తున్నాడని కామెంట్స్..

Updated on: Jan 17, 2021 | 8:08 AM

India Vs Australia 2020: భారత్, ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బ్రిస్బేన్‌లో నాలుగో టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలిసారిగా అరంగ్రేటం చేసిని యువ పేసర్ నటరాజన్ గురించి రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటరాజన్‌ గొప్పగా బౌలింగ్ చేస్తున్నాడని, విదేశాల్లో మొదటిసారిగా క్రికెట్ ఆడటమంటే అంత సులువు కాదని రోహిత్ అన్నాడు.

అంతేగాక ఆసీస్‌ వంటి బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ అంటే ఆషామాషీ కాదని కానీ అయినా అతడిపై కొంచెం కూడా ఒత్తిడి లేదని కొనియాడాడు. తొలి బంతి నుంచి అతడి ప్రదర్శన ఒకేలా ఉందని, తన దృఢమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నాడని పొగిడాడు. అంతేకాకుండా ప్రస్తుత యువ బౌలర్లలో ఎక్కువ మంది ఆస్ట్రేలియాలో తొలిసారిగా ఆడుతున్నారని పేర్కొన్నాడు. మెల్‌బోర్న్‌ టెస్టులో సిరాజ్‌, సిడ్నీ టెస్టులో సైని అరంగేట్రం చేశారని, వాళ్లకి అనుభవం లేకున్నా ఎంతో క్రమశిక్షణగా బౌలింగ్ చేస్తున్నారని తెలిపాడు. మంచి వికెట్‌పై అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేయడం గొప్ప అనుభవమని కామెంట్స్ చేశాడు.

కూతురు పుట్టింది.. అదృష్టాన్ని తెచ్చింది.. మురిసిపోతున్న యువ పేసర్ నటరాజన్..