Micro Art: క్రికెట్ పిచ్, వికెట్స్, వరల్డ్ కప్, స్టేడియం అన్ని బంగారమే.. స్వర్ణకారుడి ప్రతిభకు సలామ్ అనాల్సిందే..

| Edited By: Surya Kala

Nov 19, 2023 | 8:41 AM

భారత దేశంలో క్రికెట్ అభిమానులకు, కళాకారులకు కొదవ లేదు. ఈ రెండు అంశాలు సమ్మిళితం అయితే ఎలా ఉంటుందో తెలుసా. బియ్యపు గింజ సైజ్ లో వరల్డ్ కప్, స్టేడియం, పిచ్, వికెట్స్ రూపుదిద్దుకున్నాయి. వినడానికి, చూడడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజమే.. భారత్ బాస్ ఎదైనా సాధ్యమే. వరల్డ్ కప్ లో మన దేశం ఘనవిజయం సాధించాలని తన ప్రతిభను చాటుతూ స్వర్ణకారుడు బియ్యపు గింజ ఆకారంలో వరల్డ్ కప్ ను, స్టేడియం పిచ్చును, వికెట్లను తయారు చేసి అబ్బురపరిచాడు.

Micro Art: క్రికెట్ పిచ్, వికెట్స్, వరల్డ్ కప్, స్టేడియం అన్ని బంగారమే.. స్వర్ణకారుడి ప్రతిభకు సలామ్ అనాల్సిందే..
Mini World Cup
Follow us on

క్రికెట్ ఫీవర్ తో టోటల్ కంట్రీ ఊగిపోతోంది. గుజరాత్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం భారత్ తో పాటు గ్లోబల్ క్రికెట్ ఫ్యాన్స్ ఉత్సహంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే భారత్ లో ఎక్కడ చూసినా, మాట్లాడుకున్న అంతా వరల్డ్ కప్ గురించే. చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ ఈ ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు రకరకాలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అసలే ఆదివారం.. అది కూడా వరల్డ్ కప్ ఫైనల్, భారత్ వర్సెస్ అసిస్ మ్యాచ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

 

ఇక భారత దేశంలో క్రికెట్ అభిమానులకు, కళాకారులకు కొదవ లేదు. ఈ రెండు అంశాలు సమ్మిళితం అయితే ఎలా ఉంటుందో తెలుసా. బియ్యపు గింజ సైజ్ లో వరల్డ్ కప్, స్టేడియం, పిచ్, వికెట్స్ రూపుదిద్దుకున్నాయి. వినడానికి, చూడడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజమే.. భారత్ బాస్ ఎదైనా సాధ్యమే.

వరల్డ్ కప్ లో మన దేశం ఘనవిజయం సాధించాలని తన ప్రతిభను చాటుతూ స్వర్ణకారుడు బియ్యపు గింజ ఆకారంలో వరల్డ్ కప్ ను, స్టేడియం పిచ్చును, వికెట్లను తయారు చేసి అబ్బురపరిచాడు. క్రికెట్ వరల్డ్ కప్ నమూనా కేవలం 110 మి.గ్రా. బంగారంతో తయారు చేసి నల్లమల స్వర్ణ కారుడు తన క్రికెట్ భక్తిని చాటాడు.

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రానికి చెందిన కపిలవాయి గోపీ చారీ గత కొన్నేళ్లుగా సూక్ష్మ స్వర్ణ నమూనాలను తయారు చేస్తూ వెలుగులోకి వచ్చాడు. రేపు నిర్వహించే వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్స్ సందర్భంగా భారత్ విజయం సాధించాలనే లక్ష్యంతో వరల్డ్ కప్ నమూనాను కేవలం 110 మి.గ్రా. బంగారముతో తయారు చేశాడు. ఇతను గతంలో కూడా జాతీయ జెండాతో పాటు విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తో పాటు ఎన్నో వస్తువులను బియ్యం గింజ సైజులో తయారు చేసి అందరి అభినందనలు పొందారు.  సందర్భం ఎదైనా సత్తా చాటేవారే భారత దేశ కళాకారులని మరోసారి నిరూపించాడు స్వర్ణకారుడు గోపి చారీ.\

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..