WPL 2026 MI vs RCB : నరాలు తెగే ఉత్కంఠ.. ముంబై ఆశలపై నీళ్లు చల్లిన బెంగళూరు

WPL 2026 MI vs RCB : డబ్ల్యూపీఎల్ 2026 సీజన్ గ్రాండ్ ఓపెనింగ్‌లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై ముంబై విజయం సాధించి, టోర్నీలో బోణీ కొట్టింది.

WPL 2026 MI vs RCB : నరాలు తెగే ఉత్కంఠ.. ముంబై ఆశలపై నీళ్లు చల్లిన బెంగళూరు
Wpl 2026 Mi Vs Rcb (1)

Updated on: Jan 09, 2026 | 11:21 PM

WPL 2026 MI vs RCB : మహిళా ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే భారీ సంచలనం నమోదైంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఈ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు షాక్ ఇచ్చింది. ముంబై నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో కొత్త ఏడాదిలో ఆర్సీబీ ఘనవిజయంతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఒకానొక దశలో ముంబై బౌలర్ల ధాటికి ఆర్సీబీ ఓటమి ఖాయం అనుకున్న తరుణంలో, ఆల్‌రౌండర్ నాడిన్ డి క్లెర్క్ విశ్వరూపం చూపించి అసాధ్యమైన విజయాన్ని సుసాధ్యం చేసింది.

155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఓపెనర్లు స్మృతి మందన(18), గ్రేస్ హారిస్(25) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం రెండు ఓవర్లలోనే 20 పరుగులు రాబట్టి ముంబై బౌలర్లపై ఒత్తిడి పెంచారు. అయితే, మధ్యలో ముంబై బౌలర్లు పుంజుకోవడంతో ఆర్సీబీ వరుసగా వికెట్లు కోల్పోయింది. హేమలత (7), రిచా ఘోష్ (6), రాధా యాదవ్ (1) నిరాశపరిచారు. వరుసగా వికెట్లు కోల్పోయి 121 పరుగులకే 7 వికెట్లు పారేసుకుంది. గెలుపుకు చివరి 12 బంతుల్లో 29 పరుగులు కావాల్సిన క్లిష్ట సమయంలో నాడిన్ డి క్లెర్క్ బ్యాట్ ఝుళిపించింది. ముంబై స్టార్ బౌలర్ నటాలీ స్కివర్ బ్రంట్ వేసిన 19వ ఓవర్‌లో డి క్లెర్క్ చెలరేగిపోయింది. ఆ ఓవర్‌లో వరుసగా 6, 4, 6, 4 బాది మొత్తం 20 పరుగులు రాబట్టింది. దీంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే ఆర్సీబీ 157 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.

కేవలం బ్యాటింగ్‌లోనే కాదు, బౌలింగ్‌లోనూ డి క్లెర్క్ అద్భుత ప్రదర్శన చేసింది. ముంబై ఇన్నింగ్స్‌లో కీలకమైన సజీవన్ సజనా, నికోలా కేరీ సహా 3 వికెట్లు పడగొట్టి ముంబైని తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఒత్తిడిని అధిగమించి 44 బంతుల్లో 63 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఈ సౌతాఫ్రికా ప్లేయర్ ధాటికి ముంబై బౌలర్లు నిస్సహాయంగా ఉండిపోయారు. ప్రేమ్ రావత్ (8) కూడా ఆమెకు చక్కని సహకారం అందించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 154 పరుగులు చేసినప్పటికీ, డి క్లెర్క్ విధ్వంసం ముందు ఆ స్కోరు సరిపోలేదు. ముంబై ఫీల్డింగ్‌లో కొన్ని తప్పులు చేయడం, చివరి ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇవ్వడం ఆ జట్టు ఓటమికి కారణమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ముంబైకి ఇది గట్టి ఎదురుదెబ్బ. మరోవైపు, ఆర్సీబీ మాత్రం పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లి ఈ సాల కప్పు నమ్దే అనే నమ్మకాన్ని అభిమానుల్లో మళ్ళీ చిగురింపజేసింది.

ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు హనీ సింగ్ పాటలు, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ డాన్సులతో స్టేడియం హోరెత్తిపోయింది. హర్నాజ్ సంధూ స్పీచ్ మహిళా శక్తిని చాటిచెప్పింది. ఈ గ్లామరస్ ఆరంభానికి తగ్గట్టుగానే మైదానంలో క్రికెట్ పోరు కూడా నరాలు తెగే ఉత్కంఠను పంచింది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి