800 First Look: ఫస్ట్‌లుక్‌తోనే షాకిచ్చారుగా.. మిస్టరీ స్పిన్నర్ బయోపిక్ ఫొటో చూస్తే ఔరా అనాల్సిందే..

|

Apr 17, 2023 | 4:16 PM

Muttiah Muralitharan Biopic: గ్రేట్ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ పై ఓ సినిమా రూపొందనుంది. సినిమాకు 800 అనే పేరు పెట్టారు. ఇందులో మురళీధరన్‌ పాత్రలో మధుర్‌ మిట్టల్‌ నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ చాలా బలంగా ఉంది.

800 First Look: ఫస్ట్‌లుక్‌తోనే షాకిచ్చారుగా.. మిస్టరీ స్పిన్నర్ బయోపిక్ ఫొటో చూస్తే ఔరా అనాల్సిందే..
Muttiah Muralitharan Biopic
Follow us on

800 First Look: ప్రపంచ క్రికెట్‌లో దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 51వ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘800’ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ బయోపిక్ త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ బయోపిక్ పేరు ‘800’. ఎందుకంటే ఈ లెజెండరీ స్పిన్నర్ టెస్ట్ క్రికెట్‌లో అత్యధికంగా 800 వికెట్లు పడగొట్టాడు. ఇది ప్రపంచ రికార్డు.

శ్రీలంక గ్రేట్ స్పిన్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌ను ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ మోషన్ పోస్టర్ కూడా విడుదలైంది. మురళీ అభిమానులు ఈ సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో ముత్తయ్య మురళీధరన్‌గా నటుడు మధుర్ మిట్టల్ నటించబోతున్నారు. అతని ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంతో ఆకట్టుకు మధుర్ మరోసారి సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు.

ఇవి కూడా చదవండి

ఈ ఏడాదే విడుదలకు సిద్ధం..

ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ విడుదల తేదీని ప్రకటించలేదు. అయితే పోస్టర్ ప్రకారం, ఇది ఈ సంవత్సరం విడుదల అవుతుందని తెలుస్తోంది. మధుర్ మిట్టల్ ఫస్ట్ లుక్ చూస్తే కచ్చితంగా ముత్తయ్య మురళీధర్ గుర్తుకు వస్తాడు. యవ్వనంలో ఉన్న రోజుల్లో మురళి ఇలాగే ఉండేవాడంట.

మురళీధరన్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్..

మురళీధరన్ నేటితో 51వ ఏట అడుగుపెట్టారు. మురళీధరన్‌కి టెస్టు, వన్డే క్రికెట్‌లో 1347 వికెట్లు పడగొట్టాడు. ఇది ఓ ప్రపంచ రికార్డు. మురళీధరన్ టెస్టుల్లో 133 మ్యాచ్‌ల్లో 800 వికెట్లు, వన్డేల్లో 534 వికెట్లు పడగొట్టాడు. ముత్తయ్య మురళీధర్ కాలంలో బ్యాటింగ్ చేసేందుకు బ్యాటర్లు వణికిపోయేవారు. అతని స్పిన్‌తో భయపెట్టేవాడు.

ఈ చిత్రానికి ఎంఎస్‌ శ్రీపతి దర్శకత్వం వహించారు. 800 చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో మురళీధరన్‌గా నటించడం పట్ల నటుడు మధుర్ మిట్టల్ సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..