Mustafizur Rahman: ఇట్స్ అఫీషియల్.! ఆ ప్లేయర్‌ను వదిలేయండి.. కేకేఆర్‌కు బీసీసీఐ ఆదేశాలు..

బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2026 నుంచి బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను తొలగించాలని కేకేఆర్‌కు ఆదేశాలు ఇచ్చింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులే ఈ నిర్ణయానికి కారణం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి ఇక్కడ చూడండి.

Mustafizur Rahman: ఇట్స్ అఫీషియల్.! ఆ ప్లేయర్‌ను వదిలేయండి.. కేకేఆర్‌కు బీసీసీఐ ఆదేశాలు..
Mustafizur Rahman

Updated on: Jan 03, 2026 | 1:24 PM

బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2026 నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను తొలగించాలని కేకేఆర్‌కు ఆదేశాలు ఇచ్చింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 కోసం ఇటీవల జరిగిన వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) ముస్తాఫిజుర్‌ను రూ. 9.20 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, బీసీసీఐ కేకేఆర్‌కు ఆదేశాలు జారీ చేస్తూ, ముస్తాఫిజుర్‌ను టీమ్ నుంచి విడుదల చేయాలని, కావాలంటే అతని స్థానంలో మరొక ఆటగాడిని జట్టులోకి తీసుకోవచ్చునని తెలిపింది.

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న వరుస దాడులు, ముఖ్యంగా రెండు నుంచి మూడు వారాల వ్యవధిలో నలుగురు హిందువులను కిరాతకంగా, బహిరంగంగా హత్య చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ ఘటనలపై యూనిస్ సర్కార్ బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, బంగ్లాదేశ్ క్రికెటర్‌ను ఐపీఎల్‌లో ఆడించడంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రధానంగా, హిందూ సంఘాలు కేకేఆర్ యజమాని షారుక్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుని, బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతుంటే, ఆ దేశ క్రికెటర్‌ను ఐపీఎల్‌లో కోట్లు పెట్టి ఎలా ఆడిస్తారని ప్రశ్నించాయి.

ఇవి కూడా చదవండి

బీసీసీఐపైనా విమర్శలు వచ్చాయి. పాకిస్తాన్‌తో దౌత్యపరమైన సమస్యల కారణంగా ఆ దేశ క్రికెటర్లను ఐపీఎల్‌లో ఆడించడం లేదు. అలాంటప్పుడు బంగ్లాదేశ్ ప్లేయర్‌లను ఎలా అనుమతిస్తారనే ప్రశ్నలు తలెత్తాయి. ముస్తాఫిజుర్‌ను టీమ్ నుంచి తొలగించాలనే డిమాండ్ తీవ్రతరం కావడంతో, బీసీసీఐ అలెర్ట్ అయింది. విమర్శలను పరిగణనలోకి తీసుకుని, ముస్తాఫిజుర్‌ను విడుదల చేయాలని కేకేఆర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని కేకేఆర్‌ కూడా కన్ఫర్మ్ చేసింది. దీంతో ముస్తాఫిజుర్ ఐపీఎల్ 2026లో ఆడడం లేదు. అతని స్థానంలో మరొక ఆటగాడిని రీప్లేస్ చేసుకునే అవకాశం కేకేఆర్‌కు ఇచ్చింది. ఈ నిర్ణయం బంగ్లాదేశ్‌లోని పరిస్థితుల ప్రభావం క్రికెట్ రంగంపై ఎలా పడుతుందో స్పష్టం చేస్తుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి