Rohit Sharma: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఐపీఎల్ 2021 అంతగా కలిసిరాలేదు. ఇప్పటి వరకు 12 మ్యాచులాడిన రోహిత్ సేన కేవలం 5 విజయాలు మాత్రమే సాధించి ప్లేఆఫ్‌కు దూరంగా నిలిచింది. మిగిలిన రెండు మ్యాచుల్లో విజయం సాధిస్తేనే ప్లేఆఫ్ ఆశలు పెరుగుతాయి. నేడు జరిగే మ్యాచ్ ముంబైకి ఎంతో కీలకంగా మారింది. ఈ మ్యాచులో ఓడితో టోర్నమెంట్ నుంచి ఔటవ్వాల్సిందే. అయితే, రోహిత్ శర్మ.. మ్యాచ్‌లు లేనప్పుడు సరదాగా గడుపుతూ, తోటి ఆటగాళ్లు, తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా తన భ్యార రితికా సజ్దేను ఓ ప్రాంక్ వీడియోతో తెగ భయపెట్టాడు. ఈ వీడియోను తన ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేశాడు. అది నెటిజన్ల హృదయాలను ఎంతోగానో ఆకట్టుకుంది.
రోహిత్ స్వయంగా ఈ వీడియోను చిత్రీకరించాడు. వివరాల్లోకి వెళ్తే.. రోహిత్ మొదట తన చేతిలో ఓ చాక్లెట్‌ను పిడికిలో ఉంచుకున్నాడు. వేరే రూంలో ఉన్న తన భార్య రితికా వద్దకు వెళ్లాడు. ఆ పిడికిలో ఏముందో చూడాలంటూ భార్యను కోరాడు. అయితే అందులో ఏదో భయపెట్టే వస్తువు ఉండొచ్చని భావించిన రితికా.. పిడికిలిని ఓపెన్ చేయడానికి భయపడింది. రోహిత్ ఎంత అడిగినా పిడికిలిని ఓపెన్ చేయకపోవడంతో.. చివరికి హిట్‌మ్యాన్ ఆ సస్పెన్స్‌ను ఓపెన్ చేశాడు. అందులో చాక్లెట్ చూసిన రితికా.. తెగ నవ్వుకుంది. ఈ వీడియోను రోహిత్ శర్మ అభిమానులతో పంచుకున్నాడు. దీంతో నెట్టింట్లో ఈ వీడియో తెగ సందడి చేస్తోంది. వీరిద్దరూ ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్నారు. ఐపీఎల్ 2021 కోసం రోహిత్ తన ఫ్యామిలీతో అక్కడ ఉన్నాడు.
ముంబై టీం 12 మ్యాచ్‌లు ఆడిన తర్వాత ముంబై ఇప్పటివరకు కేవలం ఐదు గేమ్‌లు మాత్రమే గెలిచింది. తదుపరి ఆట రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ టీం 13 లో ఆరింటిని గెలుచుకుంది. అత్యుత్తమ రన్ రేట్ కారణంగా ప్లేఆఫ్‌లో నిలిచింది. అయితే ఇంకా తన బెర్త్‌ను నిర్ధారించుకోలేకపోయింది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై తమ చివరి రెండు లీగ్ మ్యాచ్‌లు గెలిస్తేనే ముంబై ప్లేఆఫ్‌లోకి ఎంటరయ్యే అవకాశం ఉంది.
Also Read: IPL 2021 DC vs CSK: ఈ లోపాలతోనే ధోని సేన ఓడింది.. అలా జరగకుంటే మ్యాచ్ మరోలా ఉండేది..!