MI vs RCB: వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..

బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ 78, విరాట్ కోహ్లీ 50, రజత్ పాటిదార్ 53 పరుగులు చేశారు. ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, మిచెల్ శాంట్నర్, శార్దూల్ ఠాకూర్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

MI vs RCB: వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
mi vs rcb

Updated on: Apr 12, 2026 | 9:40 PM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ముంబై ఇండియన్స్‌కు (MI) 241 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ 78, విరాట్ కోహ్లీ 50, రజత్ పాటిదార్ 53 పరుగులు చేశారు. ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, మిచెల్ శాంట్నర్, శార్దూల్ ఠాకూర్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

ఇరుజట్ల ప్లేయింగ్ 11:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ.

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, ట్రెంట్ బౌల్ట్, మయాంక్ మార్కండే, జస్ప్రీత్ బుమ్రా.

రెండు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్లు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రసిఖ్ సలాం దార్, వెంకటేష్ అయ్యర్, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్, మంగేష్ యాదవ్.

ముంబై ఇండియన్స్: షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, కార్బిన్ బాష్, అశ్వనీ కుమార్, రఘు శర్మ, రాజ్ బావా.

Follow Us