
Mumbai Indians IPL 2022 Retained Players: IPL చరిత్రలో ముంబై ఇండియన్స్ అత్యంత విజయవంతమైన జట్టు. రోహిత్ శర్మ సారథ్యంలో ఈ టీమ్ ఐదుసార్లు టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఐపీఎల్ 2022 వేలానికి ముందు ముంబై ఇండియన్స్ నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, కీరన్ పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్‌లను రిటైన్ చేసింది. అయితే, కీలక ఆటగాళ్లు రిలీజ్ అయ్యారు. వీరిలో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ పేర్లు ఉన్నాయి. వీరిద్దరూ ముంబై విజయానికి ప్రధాన అస్త్రాలు. అయితే ఇప్పుడు తాజాగా టీమ్ రెడీ అవుతున్నా ఇద్దరికీ చోటు దక్కలేదు. జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొనసాగనున్నాడు. జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఎంపికవ్వొచ్చు. ఇది కాకుండా.. భవిష్యత్ కెప్టెన్‌గా సూర్యను తీర్చిదిద్దే ఛాన్స్ ఉంది. ఇక కీరన్ పొలార్డ్ ఎంతకాలం జట్టుతో ఉంటాడనేది ఆసక్తికరంగా మారింది.
ముంబై ఇండియన్స్ రిటైన్ చేసిన ప్లేయర్స్..
ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. రోహిత్ శర్మకు రూ. 16 కోట్లు చెల్లిస్తోంది ముంబై ఇండియన్స్ టీమ్.
జస్ప్రీత్ బుమ్రా – బుమ్రాను వదులుకోవడానికి ఏ జట్టు సాహసించదనే చెప్పాలి. అందుకే బుమ్రాను వదులుకోవడానికి ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఇష్టపడలేదు. బుమ్రూకు రూ. 12 కోట్లు వెచ్చించి రిటైన్ చేసింది.
సూర్యకుమార్ యాదవ్ – ముంబై ఇండియన్స్ టీమ్‌లో కీలక ప్లేయర్‌గా అవతరిస్తున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. సూర్యకు రూ. 8 కోట్లు చెల్లించనుంది ఫ్రాంచైజీ.
కీరన్ పొలార్డ్- వెస్టిండీస్ ఆటగాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడింటిలోనూ అదరగొడతాడు. పొలార్డ్‌కు ముంబై ఇండియన్స్ యాజమాన్యం రూ. 6 కోట్లు చెల్లిస్తోంది.
ముంబై ఇండియన్స్ రిలీజ్ చేసిన ప్లేయర్స్..
అన్మోల్ప్రీత్ సింగ్, క్రిస్ లిన్, సౌరభ్ తివారీ, క్వింటన్ డి కాక్, పీయూష్ చావ్లా, ఇషాన్ కిషన్, ఆదిత్య తారే, అనుకుల్ రాయ్, ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, మార్కో యాన్సన్, జిమ్మీ నీషమ్, ఆడమ్ మిల్నే, యుధ్వీర్ సింగ్, ద్హావీర్ సింగ్, కౌల్టర్ -నైల్, అర్జున్ టెండూల్కర్, మొహ్సిన్ ఖాన్, జయంత్ యాదవ్ మరియు రాహుల్ చాహర్.
Also read:
Business Idea: వాటే ఐడియా గురూ.. తండ్రి ఆసక్తి.. తనయుని వ్యాపారం.. కోట్లాది రూపాయల టర్నోవర్..
Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్ వేవ్ వస్తుందా? కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ అంచనా..