Mahendra Singh Dhoni: భారత పురుషుల క్రికెట్(Indian Cricket Team) జట్టు మాజీ మేనేజర్ రత్నాకర్ శెట్టి (Ratnakar Shetty)బీసీసీఐలో తాను పనిచేసిన రోజులపై ఓ పుస్తకాన్ని రాశారు. ఇందులో భారత క్రికెట్‌కు సంబంధించిన పలు కొత్త విషయాలను బయటపెట్టాడు. అనిల్ కుంబ్లే-విరాట్ కోహ్లీ మధ్య జరిగిన వివాదాల గురించి, మహేంద్ర సింగ్ ధోనీ(Mahendra Singh Dhoni) కెప్టెన్‌గా మారడం, మొదటి టీ20 ప్రపంచ కప్‌లో సౌరవ్ గంగూలీ ఆడకపోవడం లాంటి ఎన్నో విషయాలను రాసుకొచ్చాడు. రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్‌లు ధోనీని కెప్టెన్‌గా చేయడాన్ని సమర్థించారని రత్నాకర్ శెట్టి రాసుకొచ్చారు. అదే సమయంలో, సౌరవ్ గంగూలీ 2007 టీ20 ప్రపంచ కప్ ఆడాలనుకున్నట్లు కూడా అందులో పేర్కొన్నాడు.
‘ఆన్ బోర్డ్: మై ఇయర్స్ ఇన్ బీసీసీఐ’ అనే పుస్తకంలో రత్నాకర్ శెట్టి భారత జట్టుకు ధోనీ కెప్టెన్‌గా మారడం గురించి కూడా రాసుకొచ్చారు. మొదట రాహుల్ ద్రవిడ్ ఎంఎస్ ధోనీ పేరు వెల్లడించినట్లు పేర్కొన్నాడు. దీంతో అప్పటి బోర్డు ప్రెసిడెంట్ శరద్ పవార్ సచిన్‌ని అడిగితే ఆయన కూడా అదే పేరు చెప్పినట్లు తెలిపారు.
పుస్తకంలో పేర్కొన్న దాని ప్రకారం.. ‘పవార్‌ను ఏకాంతంగా కలవాలనుకుంటున్నట్లు ఐపీఎల్ ప్రారంభం సందర్భంగా రాహుల్ ద్రవిడ్ నాతో చెప్పారు. ఈ విషయాన్ని రాష్ట్రపతికి చెప్పగా ఆయన రాహుల్‌ని తన గదికి పిలిచారు. కొన్ని నిమిషాల తర్వాత రాహుల్ తిరిగి వచ్చి నన్ను లాబీలో కలిశారు. ఫ్లైట్ ఎక్కాలి అని చెప్పి వెంటనే వెళ్లిపోయాడు. వారు అధికారిక విందు కోసం కూడా అక్కడ ఆగలేదు. పవార్ నుంచి మళ్లీ కాల్ వచ్చింది. నేను అతని గదికి వెళ్లి రాహుల్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడని తెలుసుకున్నాను. ఐసీసీ వరల్డ్ టీ20లో భారత్ తొలి మ్యాచ్‌కు ఒక రోజు ముందు రాజీనామాను ప్రకటించారని’ తెలిపారు.
ఆ తరువాత శరద్ పవార్.. తన వారసుడు ఎవరు అని రాహుల్ ద్రవిడ్‌ని అడిగినప్పుడు, రాహుల్ మహేంద్ర సింగ్ ధోనీని సిఫార్సు చేశాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఎంఎస్ ధోనీ టీమిండియాకు కెప్టెన్‌గా మారాడు. ఇంగ్లండ్ టూర్‌లో రాహుల్‌కి డిప్యూటీగా ఉన్న సచిన్‌ను కూడా పవార్ అదే ప్రశ్న అడిగారు. ఆ సాయంత్రం మేం డిన్నర్ చేస్తున్నప్పుడు రాహుల్ ఏం చెప్పాడో సచిన్ కూడా అదే చెప్పడంతో.. ఎంఎస్ ధోనీ సారథిగా మారడని తెలిపారు.
2007లో ధోనీ కెప్టెన్ అయ్యాడు..
2007లో భారత తొలి టీ20 జట్టుకు ధోనీ కెప్టెన్‌గా మారాడు. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానంలో భారత జట్టు వన్డే కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. 2008లో అనిల్ కుంబ్లే స్థానంలో ధోనీ టెస్టు ఫార్మాట్‌లో కూడా భారత కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ధోనీ టీమిండియా కెప్టెన్ అయినప్పుడు, అతను చాలా చిన్నవాడు. వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ వంటి ఆటగాళ్ల కంటే అతనికి ప్రాధాన్యత ఇచ్చారు.