IPL 2022: త్వరలో మరో షాక్ ఇవ్వనున్న ధోనీ? కీలక ప్రకటన చేసిన చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ..

|

Mar 24, 2022 | 6:08 PM

Dhoni resigns as Chennai Super Kings Captain in IPL 2022: మహేంద్ర సింగ్ ధోని గురువారం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం రవీంద్ర జడేజా జట్టుకు కొత్త కెప్టెన్ అయ్యాడు.

IPL 2022: త్వరలో మరో షాక్ ఇవ్వనున్న ధోనీ? కీలక ప్రకటన చేసిన చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ..
Ipl 2022 Ms Dhoni, Csk
Follow us on

దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) 12 ఐపీఎల్(IPL 2022) సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్‌కు నాయకత్వం వహించి, నాలుగు టైటిళ్లను గెలుచుకుని, ఐదుసార్లు రన్నరప్‌గా నిలిపి, ఆ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అకస్మాత్తుగా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు. రవీంద్ర జడేజా(Ravindra Jadeja) చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్ అయ్యాడు. రవీంద్ర జడేజాను ధోనీ ఎంపిక చేసినట్లు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ చెప్పినట్లు తెలుస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని మరో ఆటగాడికి అప్పగించాలని మహేంద్ర సింగ్ ధోనీ నిర్ణయించుకున్నాడని, జట్టుకు నాయకత్వం వహించేందుకు రవీంద్ర జడేజాను ఎంపిక చేసినట్లు చెన్నై టీం ఓ ప్రకటనలో పేర్కొంది. జడేజా 2012 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌లో అంతర్భాగంగా ఉన్నాడు. CSKకి నాయకత్వం వహించే మూడో ఆటగాడిగా నిలిచాడు. “ధోని ఈ సీజన్‌లో అంతకు మించి చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు” అని ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది.

ధోని కెప్టెన్సీని వదులుకునే ఆలోచన చెన్నై సూపర్ కింగ్స్‌కు కూడా ఇష్టం లేదు. ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. ధోనీ ఈరోజే ప్రకటన చేస్తాడనే ఆలోచన తనకు లేదని అన్నారు. అయితే ధోనీ నిర్ణయంపై విశ్వనాథన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ధోనీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే జట్టుకు మేలు జరుగుతుందని అన్నారు. విశ్వనాథన్ మాట్లాడుతూ, ‘చూడండి, ధోని ఏ నిర్ణయం తీసుకున్నా.. అది జట్టుకు మేలు చేస్తుంది. కాబట్టి మనం చింతించాల్సిన పనిలేదు. ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. అతను ఎల్లప్పుడూ మాకు మార్గదర్శకత్వం చేస్తూనే ఉంటాడు. ఆయన ఎప్పటికీ జట్టుకు కీలక సూచనలు చేస్తూనే ఉంటాడు’ అని పేర్కొన్నాడు.

ఐపీఎల్ 2022 తర్వాత ధోనీ రిటైర్?

2022 సీజన్ ధోనికి చివరిది కానుందా అనే ప్రశ్నకు కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ, “ఇది అతని చివరి సీజన్ అని నేను అనుకోను. అతను ఫిట్‌గా ఉన్నంత వరకు, అతను ఆడాలని మేం కోరుకుంటున్నాం. అతను ఏమనుకుంటున్నాడో నాకు తెలియదు. ధోనీకి ఇదే చివరి సీజన్ కావచ్చని భావిస్తున్నారు. ఇక ధోనీ బ్యాటింగ్ కూడా గత సీజన్‌లో బాగోలేదు. అందుకే అలాంటి వ్యాఖ్యలు వినిపించాయి. ఈ సీజన్‌లోని ఆటతీరు ధోనీ భవిష్యత్తు గురించి చాలా విషయాలు తెలియజేస్తుంది’ అని ఆయన అన్నారు.

జడేజా మంచి కెప్టెన్‌గా నిరూపించుకుంటాడు: విశ్వనాథన్

కెప్టెన్‌గా జడేజా నియామకంపై విశ్వనాథన్ ఆల్ రౌండర్ నాయకత్వంలో జట్టు రాణిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘జడ్డూ కెప్టెన్సీతో ఆకట్టుకుంటాడు. కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ధోని మార్గనిర్దేశంలో అతను కచ్చితంగా రాణిస్తాడు. జడ్డూ 10 సంవత్సరాలుగా మాతో ఉన్నాడు. అతను జట్టు పరిస్థితిని బాగా అర్థం చేసుకున్నాడు’ అని అన్నాడు.

Also Read: MS Dhoni Quits CSK Captaincy: ధోనీ కెరీర్‌లో 3 వివాదాలు.. ఫ్యాన్స్ మాత్రమే కాదు, ప్రపంచమే షాక్.. అవేంటంటే?

MS Dhoni Quits CSK Captaincy: 11 ఫ్లేఆఫ్స్.. 9 ఫైనల్స్.. 4 సార్లు ఛాంపియన్.. ధోనీ రికార్డులు చూస్తే వావ్ అనాల్సిందే..