
Dhoni records IPL 2026: ‘లాస్ట్ సీజన్ ఇదేనా’ అనే మాటే అభిమానులకు ఆందోళన కలిగిస్తూనే ఉంటుంది. కానీ, ఆ సీజన మొత్తం ఆడుతూ ఎంఎస్ ధోని (MS Dhoni) అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. తాజాగా ఐపీఎల్ 2026లో మళ్లీ ఆడుతున్నాడనే విషయం తెలిసిందే.
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్‌గా ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. గత కొన్ని సీజన్లుగా రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలను పక్కనబెట్టి మరోసారి అభిమానుల కోసం మైదానంలోకి వస్తున్నాడు. ఈ క్రమంలో ధోని మరో 7 భారీ రికార్డులపై కన్నేశాడు.
‘సెవెన్-స్టార్ సీజన్’: మహీ లక్ష్యంగా పెట్టుకున్న ఆ 7 రికార్డులు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ధోనీ ఇప్పటివరకు చెన్నై తరపున 248 మ్యాచ్‌లు ఆడాడు. ఇంకో 2 మ్యాచ్‌లు ఆడితే 250 మ్యాచ్‌లు పూర్తి చేసిన తొలి ఆటగాడవుతాడు.
చెన్నై తరపున 4865 పరుగులు చేసిన ధోనీ, 5000 రన్స్ క్లబ్‌లో చేరడానికి కేవలం 135 పరుగులు దూరంలో ఉన్నాడు.
ధోనీ ఇప్పటికే 234 సిక్సర్లు కొట్టాడు. 250 సిక్సర్లు పూర్తి చేయడానికి ఇంకా 16 సిక్సర్లు మాత్రమే అవసరం.
వికెట్‌కీపింగ్‌లో కూడా రికార్డులు..
ధోనీ మొత్తం 158 క్యాచులు పట్టాడు. కానీ CSK కోసం 150 క్యాచులు పూర్తి చేయడానికి ఇంకా 10 క్యాచులు అవసరం.
ధోనీ ఇప్పటికే 142 విజయాలు చెన్నైతో సాధించాడు. ఇంకో 8 మ్యాచ్‌లు గెలిస్తే ఈ అరుదైన రికార్డు చేరుకుంటాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ధోనీ ఇప్పటికే 906 పరుగులు చేశాడు. 1000 రన్స్ క్లబ్‌లో చేరడానికి కేవలం 94 పరుగులు మాత్రమే అవసరం.
ఈ సీజన్‌లో ఒక ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ గెలిస్తే, అత్యధిక వయస్సులో ఆ అవార్డు గెలిచిన ఆటగాడిగా తన రికార్డును తానే బ్రేక్ చేస్తాడు. ప్రస్తుతం ధోనీ వయస్సు 44 సంవత్సరాలు దాటింది.
ఎంఎస్ ధోని ఐపీఎల్ కేవలం ఆటగాడు కాదు.. ఒక లెజెండ్. ఐపీఎల్ 2026లో అతను సాధించబోయే ఈ 7 రికార్డులు అతని కెరీర్‌కు మరో గోల్డెన్ అధ్యాయాన్ని జోడించనున్నాయి. అభిమానులు మరోసారి ‘మహీ మ్యాజిక్’ కోసం ఎదురుచూస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..