MS Dhoni: మొదటి 2 వారాలు ఐపీఎల్ మ్యాచ్‌లకు ధోని దూరం.. అధికారిక ప్రకటన

అభిమానులకు నిరాశ కలిగించే వార్తతో ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమైంది. చెన్నై జట్టు స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు మేనేజ్మెంట్ అధికారికంగా ప్రకటించింది. చెన్నై జట్టు శనివారం (మార్చి 28) ఉదయం విడుదల చేసిన ప్రకటనలో ధోనీ గాయానికి గురైనట్లు తెలిపింది.

MS Dhoni: మొదటి 2 వారాలు ఐపీఎల్ మ్యాచ్‌లకు ధోని దూరం..  అధికారిక ప్రకటన
MS Dhoni

Updated on: Mar 28, 2026 | 10:36 AM

అభిమానులకు భారీ షాక్‌తో ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమైంది. CSK స్టార్ ప్లేయర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. జట్టు విడుదల చేసిన అధికారిక ప్రకటనతో ఈ వార్త ఒక్కసారిగా క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. శనివారం (మార్చి 28) ఉదయం చెన్నై యాజమాన్యం వెల్లడించిన వివరాల ప్రకారం ధోనీ గాయానికి గురయ్యాడు. ఈ గాయం కారణంగా కనీసం తొలి రెండు వారాల పాటు మ్యాచులకు దూరంగా ఉండనున్నాడు. దీంతో సీజన్ ఆరంభంలోనే చెన్నై జట్టు పెద్ద పరీక్షను ఎదుర్కొనాల్సి వస్తోంది.

ధోనీ లేకుండా చెన్నై అంటే.. అది ఫుల్ బ్యాటరీ లేకుండా మొబైల్ లాంటిదే అంటున్నారు అభిమానులు. ఎందుకంటే మ్యాచ్ చివరి క్షణాల్లో ఆటను తిప్పేయగల శక్తి, కూల్‌గా నిర్ణయాలు తీసుకునే తీరు, వికెట్ కీపింగ్‌లో చూపించే క్లాస్.. ఇలా ధోని అంటే ఓ ప్యాకేజ్. అలాంటి ప్లేయర్ లేకపోవడం జట్టుకు ఖచ్చితంగా లోటే. అయితే ఇదే టైమ్‌ను అవకాశంగా మార్చుకునేందుకు జట్టులోని యువ ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. “ధోనీ లేని గ్యాప్‌ను ఫిల్ చేయగలమా?” అన్నది ఇప్పుడు అందరి దృష్టి. మేనేజ్‌మెంట్ కూడా ఇప్పుడు దానిపైనే ఫోకస్ పెట్టింది. మిస్టర్ కూల్ త్వరగా కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులకు కోరకుంటున్నారు.

Follow Us