IPL 2021 Final: ధోనీ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన గౌతమ్ గంభీర్.. ఇలా అంటాడని ఎవ్వరూ ఊహించలే..!

|

Oct 15, 2021 | 4:55 PM

ఇంత వరకు ఫైనల్‌లో ఓడిపోని రికార్డుతో కేకేఆర్ బలంగా కనిపిస్తుండగా, కేవలం ధోనీ బలంతో చెన్నై టీం ముందుకు సాగనుంది. అయితే తాజాగా ధోనీ వర్సెస్ ఇయాన్ మెర్గాన్‌లో ఎవరు బెస్ట్ అనే ప్రశ్నకు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆన్సర్ ఇచ్చాడు.

IPL 2021 Final: ధోనీ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన గౌతమ్ గంభీర్.. ఇలా అంటాడని ఎవ్వరూ ఊహించలే..!
Ipl 2021 Final, Csk Vs Kkr
Follow us on

IPL 2021 Final, CSK vs KKR: ఐపీఎల్ 2021 ఫైనల్‌లో నేడు కీలకమైన పోరు జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ ఢీకొనబోతున్నాయి. ధోనీ సేన 4వ సారి టైటిల్ కోసం బరిలో నిలవగా, కేకేఆర్ టీం 3 వ సారి ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకునేందుకు సిద్దమైంది. అయితే ఇంత వరకు ఫైనల్‌లో ఓడిపోని రికార్డుతో కేకేఆర్ బలంగా కనిపిస్తుండగా, కేవలం ధోనీ బలంతో చెన్నై టీం ముందుకు సాగనుంది. అయితే తాజాగా ధోనీ వర్సెస్ ఇయాన్ మెర్గాన్‌లో ఎవరు బెస్ట్ అనే ప్రశ్నకు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆన్సర్ ఇచ్చాడు. అయితే ఈ ఆన్సర్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ డాషింగ్ ఆటగాడు. భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మహేంద్ర సింగ్ ధోనీని ప్రశంసించి ఔరా అనిపించాడు. కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ కంటే ధోనీ చాలా గొప్పవాడు. నేడు జరిగే ఫైనల్లో ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ మోర్గాన్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనున్న సంగతి తెలిసిందే.

ఫామ్ ఆధారంగా పోల్చడం తప్పు
స్పోర్ట్స్ వెబ్‌సైట్‌తో మాట్లాడిన గంభీర్.. ‘ధోనీ, మోర్గాన్‌ల ఫామ్‌ను పోల్చడం తప్పు. ఎందుకంటే ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. మోర్గాన్ తన జాతీయ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. మీరు ఆపిల్‌లను నారింజతో పోల్చకూడదు. ధోని ఇంత కాలం అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ధోని ఫామ్‌లో లేకపోయినా లేదా తక్కువ సహకారం అందించినా ఆమోదయోగ్యమైనది. కానీ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. అయితే వీరిద్దరి బ్యాటింగ్‌ని పోల్చి చూస్తే, మోర్గాన్ కంటే ఐపీఎల్ 2021 లో ధోనీ ప్రదర్శన చాలా మెరుగ్గా ఉంది’ అని అన్నారు.

ధోనీకి అనేక బాధ్యతలు ఉన్నాయి
‘ధోనీ మూడు బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. (కెప్టెన్సీ, బ్యాటింగ్, కీపింగ్). అదే సమయంలో మోర్గాన్ మాత్రం రెండు బాధ్యతలను( కెప్టెన్, బ్యాటింగ్) నిర్వహిస్తున్నారు. అయితే వీటిలో ఒకదానిలో అతని పనితీరు పూర్తిగా పేలవంగా ఉంది. ధోనీ ఈ సీజన్‌లో కెప్టెన్, వికెట్ కీపర్‌గా బాగా రాణించాడు. కాబట్టి రెండింటి రూపాన్ని పోల్చడం సముచితం కాదు’ అంటూ గంభీర్ చెప్పుకొచ్చాడు.

మోర్గాన్ ఈ సీజన్‌లో విఫలం
ఈ సీజన్‌లో మోర్గాన్ నాలుగు సార్లు సున్నా పరుగులకే ఔట్ అయ్యాడు. ఏ ఐపీఎల్ సీజన్‌లోనైనా కెప్టెన్‌గా ఇది అత్యంత దారుణమైన రికార్డుగా నిలిచింది. ఐపీఎల్ 14, 15 ఇన్నింగ్స్‌లలో, మోర్గాన్ 11.73 సాధారణ సగటుతో 129 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అదే సమయంలో ధోనీ బ్యాట్ 11 ఇన్నింగ్స్‌లలో 16.29 సగటుతో 114 పరుగులు మాత్రమే చేసింది.

Also Read: MS.Dhoni: నెట్స్‎లో చెమటోర్చిన ఎంఎస్ ధోనీ.. ఫైనల్లో హెలికాప్టర్ షాట్‌తో మ్యాచ్ గెలిపిస్తాడా..

IPL 2021 final: ఫైనల్ చేరడంలో ఈ నలుగురు కీలక పాత్ర పోషించారు.. మరి ఫైనల్‎లో వారు ఎలా ఆడతారో..