MS Dhoni: అయోధ్య నుంచి ఎంఎస్‌ ధోనికి పిలుపు.. రామమందిర ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానం

క్రీడా ప్రముఖుల విషయానికొస్తే.. ఇప్పటికే సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లీ తదితరులకు అయోధ్య నుంచి పిలుపు అందింది. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి అయోధ్య రామ మందిర ఆహ్వానం అందింది. ఈ మేరకు కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యులు అయోధ్య ఆహ్వాన పత్రికను అందజేశారు.

MS Dhoni: అయోధ్య నుంచి ఎంఎస్‌ ధోనికి పిలుపు.. రామమందిర ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానం
Mahendra Singh Dhoni

Updated on: Jan 16, 2024 | 7:28 AM

జనవరి 22 న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠాపనకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చారిత్రక ఘట్టాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు జనవరి 22న అయోధ్య చేరుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం శ్రీరామ జన్మభూత తీర్థక్షేత్ర ట్రస్ట్ దేశ విదేశాల్లోని మహా సాధువులు, పండితులు, వివిధ రంగాల్లోని ప్రముఖులకు ఆహ్వానాలు అందిస్తోంది. క్రీడా ప్రముఖుల విషయానికొస్తే.. ఇప్పటికే సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లీ తదితరులకు అయోధ్య నుంచి పిలుపు అందింది. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి అయోధ్య రామ మందిర ఆహ్వానం అందింది. ఈ మేరకు కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యులు అయోధ్య ఆహ్వాన పత్రికను అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోస్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయోధ్య రామమందిర ఆహ్వానాన్ని అందుకునేందుకు ధోని అన్ని విధాలా అర్హుడు అని అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. జైశ్రీరామ్ అని పోస్టులు షేర్‌ చేస్తున్నారు.

కాగా ధోనికన్నా ముందే సచిన్‌ టెండూల్కర్ కు కూడా అయోధ్య నుంచి పిలుపు వచ్చింది. అలాగే విరాట్‌ కోహ్లీ దంపతులకు కూడా ఆహ్వానం అందింది. అలాగే పలువురు క్రీడా ప్రముఖులకు కూడా ఇన్విటేషన్లు అందాయని తెలుస్తోంది. జనవరి 22న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ధోనికి ఆహ్వానం అందజేస్తున్న శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ సభ్యులు..

సచిన్ టెండూల్కర్ కు పిలుపు..

ఉజ్జయినీ మహాకాలేశ్వర్ ఆలయంలో టీమిండియా క్రికెటర్లు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..