Video: ఫోక్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేసిన ధోనీ, హార్దిక్.. అదుర్స్ అంటోన్న ఫ్యాన్స్.. వైరల్ వీడియో..

|

Jan 27, 2023 | 2:50 PM

MS Dhoni-Hardik Pandya Dance Video: హార్దిక్, మహి ఎలా స్టెప్పులు వేశారో ఈ వీడియోలో చూడొచ్చు. అదే సమయంలో, వారితో పాటు కొంతమంది స్నేహితులు కూడా ఉన్నారు. స్నేహితులతో కలసి అదిరిపోయే స్టెప్పులేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరలవుతోంది.

Video: ఫోక్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేసిన ధోనీ, హార్దిక్.. అదుర్స్ అంటోన్న ఫ్యాన్స్.. వైరల్ వీడియో..
Ms Dhoni Hardik Pandya Dance Video
Follow us on

టీమిండియా మాజీ కెప్టెన్, రెండుసార్లు భారతదేశానికి ప్రపంచ కప్ అందించిన మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni)… ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. కుటుంబం, స్నేహితులతో కలసి జీవితాన్ని ఆనందిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇందులో అతను జార్ఖండ్ సాంప్రదాయ పాటపై డ్యాన్స్ చేస్తున్నాడు. విశేషమేమిటంటే అతనితో పాటు హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు. హార్దిక్‌, ఎంఎస్‌డీ జోడీ డ్యాన్స్ చేసిన ఈ వీడియో వెలుగులోకి రావడంతో నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు.

హార్దిక్, మహి ఎలా స్టెప్పులు వేశారో ఈ వీడియోలో చూడొచ్చు. అదే సమయంలో, వారితో పాటు కొంతమంది స్నేహితులు కూడా ఉన్నారు. స్నేహితులతో కలసి అదిరిపోయే స్టెప్పులేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.

ఈ వీడియోపై నెటిజన్లు మహి, పాండ్యాల స్టెప్పులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ యూజర్ ‘ఏక్ హి దిల్ హై మహి.. కిత్నే బార్ జీతోగే’ అని కామెంట్ చేశాడు. ఇప్పటి వరకు లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు. మీరు కూడా ఈ వీడియో ఓ లుక్కేయండి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..