IND vs NZ: ఇండియన్‌ ఓపెనర్ల తడాఖా.. ఖాతాలోకి సరికొత్త రికార్డ్‌.. ఏంటంటే..?

|

Nov 18, 2021 | 6:06 AM

IND vs NZ: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన భారత్-న్యూజిలాండ్ తొలి మ్యాచ్‌లో భారత్‌ ఐదు వికెట్ల తేడాతో

IND vs NZ: ఇండియన్‌ ఓపెనర్ల తడాఖా.. ఖాతాలోకి సరికొత్త రికార్డ్‌.. ఏంటంటే..?
Rahul And Rohit
Follow us on

IND vs NZ: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన భారత్-న్యూజిలాండ్ తొలి మ్యాచ్‌లో భారత్‌ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్ రోహిత్ శర్మ, KL రాహుల్‌లకు సరికొత్త ప్రారంభం ఎందుకంటే రోహిత్‌ను భారత T20 జట్టుకు శాశ్వత కెప్టెన్‌గా నియమించారు. మరోవైపు KL రాహుల్ వైస్ కెప్టెన్‌గా నియమించారు. కొత్త బాధ్యతల నడుమ ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఈ జోడీ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. న్యూజిలాండ్ టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసింది. భారత్‌కు 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఈ క్రమంలో రోహిత్‌, రాహుల్‌లు జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ఈ జోడీ టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత్ తరఫున అత్యధిక ఫిఫ్టీ పార్ట్‌నర్‌షిప్ సాధించిన జోడీగా నిలిచింది. వీరిద్దరికి ఇది12 అర్ధ సెంచరీల భాగస్వామ్యం. రాహుల్ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు దీంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. ఈ విషయంలో రోహిత్ శర్మ తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. ఇంతకు ముందు శిఖర్ ధావన్‌తో కలిసి టీ20 ఇంటర్నేషనల్స్‌లో 11 సార్లు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలు చేశాడు.

అయితే ధావన్ ఇకపై జట్టులో ఆడటం లేదు. రాహుల్ అతని స్థానంలో ఉన్నాడు. కనుక వీరి జోడి ముందు ముందు చాలా రికార్డ్‌లు క్రియేట్ చేసే అవకాశం ఉంది. దీని తర్వాత విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ చాలా అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. కోహ్లీతో కలిసి రోహిత్ టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఏడుసార్లు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలు సాధించాడు. అయితే కోహ్లీ కూడా ఈ సిరీస్‌లో ఆడడం లేదు. దీంతో రోహిత్, రాహుల్‌ల జోడి మరింత ముందుకు దూసుకెళుతుంది. మరోవైపు ఓవరాల్ రికార్డ్ గురించి మాట్లాడితే టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీ భాగస్వామ్యాల రికార్డు ఐర్లాండ్‌కు చెందిన కెవిన్ ఓబ్రెయిన్, పాల్ స్టిర్లింగ్ పేరిట ఉంది. వీరిద్దరూ టీ20 ఇంటర్నేషనల్స్‌లో 13 సార్లు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేశారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన 6 ఏళ్ల బాలిక.. ఏ విషయంలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

IND vs NZ: ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం

విటమిన్‌ ‘E’ లేకుంటే శరీరంలో ఈ రెండు పనిచేయవు..! అందుకే ఈ 5 ఆహారాలు తప్పనిసరి..