Mohammed Shami: ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా.. మీరు త్వరగా కోలుకోవాలి’ తల్లిని కలుసుకున్న మహ్మద్‌ షమీ

ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు మహ్మద్ షమీ తల్లి అంజుమ్ అరా తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. కుటుంబ సభ్యులు గ్రామంలోని స్థానిక ఆసుపత్రికి ఆమెను తీసుకెళ్లినట్లు వార్తలు వచ్చాయి. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య సదుపాయాల కోసం నగరానికి తీసుకెళ్లారు. అయితే ఇప్పుడామె పూర్తిగా కోలుకున్నారు. మరోవైపు  ప్రపంచ కప్ ముగిసిన తర్వాత షమీ తన ఇంటికి తిరిగి వచ్చాడు.

Mohammed Shami: నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా.. మీరు త్వరగా కోలుకోవాలి తల్లిని కలుసుకున్న మహ్మద్‌ షమీ
Mohammed Shami

Updated on: Nov 23, 2023 | 2:44 PM

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ పేసర్‌ మహ్మద్‌ షమీ అమోఘంగా రాణించాడు. మొదటి నాలుగు మ్యాచుల్లో తుది జట్టులో ఛాన్స్‌ రాక పోయినా ఓవరాల్‌గా 24 వికెట్లు తీశాడు. తద్వారా వరల్డ్‌ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఫైనల్‌లో భారత జట్టు ఓటమి పాలైనా షమీ ఆటతీరును అందరూ మెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు మహ్మద్ షమీ తల్లి అంజుమ్ అరా తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. కుటుంబ సభ్యులు గ్రామంలోని స్థానిక ఆసుపత్రికి ఆమెను తీసుకెళ్లినట్లు వార్తలు వచ్చాయి. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య సదుపాయాల కోసం నగరానికి తీసుకెళ్లారు. అయితే ఇప్పుడామె పూర్తిగా కోలుకున్నారు. మరోవైపు  ప్రపంచ కప్ ముగిసిన తర్వాత షమీ తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ సందర్భంగా తన తల్లితో ఉన్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసుకున్నాడు.. ‘ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను ‘ అని ఎమోషనల్ పోస్టు షేర్‌ చేశాడు. దీనికి హార్ట్ ఎమోజీని కూడా జోడించాడు. ప్రస్తుతం మహ్మద్‌ షమీ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. షమీ తల్లి త్వరగా కోలుకోవాలని అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇక మహ్మద్‌ షమీ సోదరి షబీనా ఖాతూన్‌ తన తల్లి ఆరోగ్యంపై మరో అప్‌ డేట్ ఇచ్చింది. ‘ప్రపంచకప్ ఫైనల్ రోజు ఉదయం నుంచి అమ్మకు జ్వరం పెరిగింది. తీవ్రమైన నొప్పి రావడంతో సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడి మెడిసిన్స్‌ తీసుకుని మధ్యాహ్నానికే ఇంటికి వచ్చింది. అమ్మ ఆరోగ్యం ఇప్పుడు మెరుగ్గా ఉంది’ అని షబీనా చెప్పుకొచ్చింది. కాగా 2019 ప్రపంచకప్‌లోనూ అద్భుతంగా రాణించాడు షమీ. కేవలం 4 మ్యాచుల్లోనే 14 వికెట్లు పడగొట్టాడు. అంతకు ముందు 2015 ప్రపంచ కప్‌లో 7 మ్యాచుల్లో 17 వికెట్లు తీశాడు.

ఇవి కూడా చదవండి

తల్లితో మహ్మద్ షమీ..

ఫైనల్ లో ఓటమి తర్వాత షమీని ఓదార్చుతున్న ప్రధాని మోడీ

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..