Rohit Sharma: ఆర్సీబీకి కెప్టెన్‌గా రోహిత్.. మాజీ క్రికెటర్ సలహా

|

Oct 03, 2024 | 6:26 PM

ఇటీవలే కాన్పూర్‌లో రెండో బంగ్లాదేశ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా అసాధారణ ప్రతిభ కనబరించింది. దీనికి క్రెడిట్ కెప్టెన్ రోహిత్ శర్మకి ఇవ్వాలి. జట్టును హిట్‌మ్యాన్ దూకుడుగా నడిపించాడు. కాగా రోహిత్ శర్మ 2025 ఐపీఎల్‌లో కెప్టెన్‌గా మాత్రమే ఆడాలని టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ పేర్కొన్నాడు.

Rohit Sharma: ఆర్సీబీకి కెప్టెన్‌గా రోహిత్.. మాజీ క్రికెటర్ సలహా
Rcb Captain Rohit Sharma
Follow us on

ఇటీవలే కాన్పూర్‌లో రెండో బంగ్లాదేశ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా అసాధారణ ప్రతిభ కనబరించింది. దీనికి క్రెడిట్ కెప్టెన్ రోహిత్ శర్మకి ఇవ్వాలి. జట్టును హిట్‌మ్యాన్ దూకుడుగా నడిపించాడు. కాగా రోహిత్ శర్మ 2025 ఐపీఎల్‌లో కెప్టెన్‌గా మాత్రమే ఆడాలని టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఆయన పలు సంచలన సూచనలు చేశారు. రోహిత్‌ను ఆర్సీబీ తీసుకోవాలని సూచించాడు. అతన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీసుకొని తమ కెప్టెన్‌‌గా ఆయను నియమించాలని సూచించాడు.

ఈ హిట్‌మ్యాన్ ముంబై తరుపున 2011 నుంచి ఆడుతున్నాడు. 2013లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 5 సార్లు ట్రోఫీని అందించాడు. 2024లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా హర్థిక్ పాండ్యను తీసుకొని ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా అతనికి పగ్గాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా గత ఐపీఎల్ సీజన్‌లో ముంబయి ఘోర పరాభవం చవిచూసింది. త్వరలో 2025 ఐపీఎల్ కొత్త సీజన్ వేలం జరగనుంది. ఈ వేలంలో ఆర్సీబీ మెనేజ్‌మెంట్ రోహిత్‌‌ను సొంతం చేసుకోవాలని మహ్మద్ కైఫ్ సలహా ఇచ్చాడు.

రోహిత్ గ్రేట్ కెప్టెన్ అని, కావున హిట్‌మ్యాన్ ఐపీఎల్‌లో సారిథిగా అడాలని కైఫ్ సూచించాడు. అతడి సారథ్యంలో భారత్‌కు టీ20 వర్డల్ కప్ లభించినట్లు గుర్తు చేశాడు. అలాంటి రోహిత్‌కి వివిధ జట్ల నుంచి ఆఫర్లు వస్తాయనే విషయం అందరీకి తెలుసు అని, అతన్ని పలు ఫ్రాంఛైజీలు తమ జట్లులోకి కోరుతున్నట్లు తమకు తెలుస్తుందన్నారు. కానీ ఆర్సీబీ ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఏదో విధంగా రోహిత్‌ను కాన్విన్స్ చేసి పగ్గాలు అప్పగించాలని పేర్కొన్నారు. రోహిత్ భారీగా స్కోర్‌ చేయకపోవచ్చు కానీ అతనికి టీమ్‌ను గొప్ప నడిపించగలడని తెలిపారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి