Mithali Raj: మిథాలీ రాజ్ కూడా మన కులమే రోయ్..ఐపీఎల్‌లో ఆ టీమ్ అంటేనే ఇష్టమట..!

మిథాలీ రాజ్.. పరిచయం అవసరం లేని పేరు.. మహిళ క్రికెట్లో తను అందించిన విజయాలు చిరస్మరణీయం..వన్డే ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కూడా తనకు రికార్డు కూడా ఉంది. ఇంతకీ మిథాలీ రాజ్ ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా? మిథాలీ రాజ్‌కి ఇష్టమైన ఐపీఎల్ జట్టు ఏదో తెలుసా?

Mithali Raj:  మిథాలీ రాజ్ కూడా మన కులమే రోయ్..ఐపీఎల్‌లో ఆ టీమ్ అంటేనే ఇష్టమట..!
Mithali Candidly Revealed Her Favourite Team In The Ipl
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Dec 03, 2024 | 3:26 PM

భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఇటీవల యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా హోస్ట్ చేసిన పోడ్‌కాస్ట్‌లో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తనకు ఐపీఎల్‌(IPL)లో ఇష్టమైన ఫ్రాంచైజీ ఏదో కూడా చెప్పేసింది. రణవీర్  మీరు RCB ఫ్యానా? అని అడుగగా దానికి ఆమె తను RCB ఫ్యాన్ కాదని.. SRH ఫ్యాన్‌ అని తను మనస్సులో మాట బయటకు చెప్పేసింది. తను హైదరాబాద్ నుంచి వచ్చాను కాబట్టి Sunrisers ఫ్యాన్ అని తెలిపింది. కొన్ని సార్లు సరిగా ఆడకపోయినా సరే మన టీమ్‌ను మనమే సపోర్ట్ చేయాలిగా అని చెప్పుకొచ్చింది. అలాగే అదే పోడ్‌కాస్ట్‌లో పెళ్లి ఎందుకు చేసుకోలేదో కూడా క్లారిటీ ఇచ్చింది. తను క్రికెట్ కోసం పెళ్లిని పక్కన పెట్టినట్లు చెప్పింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెటింట్లో చక్కర్లు కొడుతుంది.

మిథాలీ మహిళ  క్రికెట్లో లెజెండరీ క్రికెటర్ అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. మహిళల క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రసిద్ధ, నిష్ణాతులైన క్రికెటర్లలో ఒకరు మిథాలీ.. 20 ఏళ్లకు పైగా సాగిన తన కెరీర్‌లో మిథాలీ వన్ డే ఇంటర్నేషనల్స్ (ODIలు)లో 7,805 పరుగుల చేసి క్రికెట్ చరిత్రలో రికార్డు స్పష్టించింది. ODIలలో ఆమె చేసిన ఏడు సెంచరీలు క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. , మిథాలీకి టెస్ట్ క్రికెట్‌లో కూడా మంచి రికార్డులే ఉన్నాయి. ఒక దశాబ్దం పాటు, ఆమె టాప్-ఆర్డర్ బ్యాటర్ మాత్రమే కాదు, భారత బ్యాటింగ్ లైనప్‌కు ఒక్క పిల్లర్‌గా కూడా నలిచింది. 2017 మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన మిథాలీ రాజ్ వరుసగా అత్యధిక అర్ధసెంచరీలు సాధించిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. పద్మశ్రీ, ఖేల్ రత్న అవార్డ్-భారతదేశంలో అత్యున్నత క్రీడా పురస్కారాలు కూడా ఆమెకు వరించాయి. భారత మహిళా క్రికెట్‌కు ఆమె చేసిన కృషి చిరస్మరణీయం అని చెప్పవచ్చు.

ఇది ఇలా ఉంటే నేడు మిథాలీ రాజ్ తన 42వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. మిథాలీ రాజ్ మొత్తం 333 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 10,868 పరుగులు చేసింది. మహిళల వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ నిలిచింది. మహిళల వన్డేల్లో అత్యధికంగా మ్యాచ్లు ఆడిన ఘనత కూడా ఆమెదే.

జూన్ 2022లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయినప్పటి నుండి మిథాలీ మెంటర్‌షిప్ పాత్రను పొషిస్తుంది. రిటైర్మెంట్ తర్వాత కోచింగ్‌ ఫిల్డ్‌లోకి ఆమె అడుగు పెట్టింది. విమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) లో మెంటార్‌గా తను సేవలు అందిస్తుంది. మిథాలీ ఇటీవల ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) లో మహిళల క్రికెట్ కార్యకలాపాలకు మెంటార్‌గా కూడా బాధ్యతలు చేపట్టింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి