ఒక్కో బంతి ఒక్కో తూటాలా దూసుకొచ్చాయి.. ఆ ఇద్దరే మా కొంప ముంచేశారు..

Indian Pacers Performance: తొలి వన్డేలో భారత్ చేతిలో న్యూజిలాండ్ ఓటమిపై కెప్టెన్ మిచెల్ శాంట్నర్ స్పందించారు. పిచ్ కండిషన్స్‌ను అర్థం చేసుకోలేకపోయామని, భారత పేసర్ల ప్రదర్శన అద్భుతమని ఆయన ప్రశంసించారు. తమ బౌలర్లు పోరాడినా, కోహ్లీని నిలువరించలేకపోయారని, రెండో వన్డేలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తామని శాంట్నర్ ధీమా వ్యక్తం చేశారు.

ఒక్కో బంతి ఒక్కో తూటాలా దూసుకొచ్చాయి.. ఆ ఇద్దరే మా కొంప ముంచేశారు..
Ind Vs Nz 2nd Odi Pacers

Updated on: Nov 05, 2026 | 11:44 AM

Indian Pacers Performance: ఆక్లాండ్ వేదికగా బుధవారం జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో న్యూజిలాండ్‌పై ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ 74 పరుగుల క్లాసిక్ ఇన్నింగ్స్‌తో రాణించగా, అర్ష్‌దీప్ సింగ్, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బారు అద్భుత బౌలింగ్‌తో కివీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. వర్షం పదేపదే అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 32 ఓవర్లకు కుదించి, 143 పరుగుల సవరించిన లక్ష్యాన్ని టీమిండియా ముందుంచారు. ఈ లక్ష్యాన్ని భారత్ 22.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించి సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టును భారత బౌలర్లు కట్టడి చేయడంతో భారీ స్కోరు చేయలేకపోయింది. ముఖ్యంగా బౌన్స్ ను సద్వినియోగం చేసుకున్న భారత పేసర్లు న్యూజిలాండ్ బ్యాటర్లను ఎక్కడా కుదురుకోనివ్వకుండా పెవిలియన్ చేర్చారు. టిమ్ సీఫర్ట్, గ్లెన్ ఫిలిప్స్ స్వల్ప పోరాటం చేసినా, అది జట్టుకు సరిపోలేదు. లక్ష్యం చిన్నది కావడంతో టీమిండియాకు గెలుపు సులువయింది. విరాట్ కోహ్లీ తన 87వ వన్డే హాఫ్ సెంచరీని నమోదు చేసుకుని, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ స్పందించారు. “వర్షం కారణంగా పిచ్ కండిషన్స్‌ను అర్థం చేసుకోలేకపోయాం. ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా భారత పేసర్లకే చెందుతుంది. పిచ్ కండిషన్స్‌ను బాగా అడాప్ట్ చేసుకొని తమపై టీమిండియా బౌలర్లు పైచేయి సాధించారు. ఈ పిచ్‌పై మేము ఊహించిన దానికంటే బంతి ఎక్కువగా బౌన్స్ అయింది. పిచ్ కాస్త వేగంగా ఉంది. దానికి తోడు టీమిండియా బౌలర్లు చక్కగా బంతులు వేసి లైన్ అండ్ లెంగ్త్‌తో తమ బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేయడం భారీ స్కోరు చేయలేకపోయాం” అని మిచెల్ శాంట్నర్ అన్నారు.

భారత బ్యాటింగ్ సమయంలో తమ బౌలర్లు కొంతమేర పోరాడినప్పటికీ, విరాట్ కోహ్లీని కట్టడి చేయడంలో ప్రణాళికలు అంతగా వర్కౌట్ కాలేదని శాంట్నర్ పేర్కొన్నారు. “అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అంత తేలిగ్గా అతని వికెట్ ఇవ్వలేదు” అని తెలిపారు. చివర్లో తమ బౌలర్లు వికెట్లు తీయగలిగినా, అప్పటికే సరైన టార్గెట్ లేకపోవడం వల్ల టీమిండియా సునాయాసంగా గెలిచిందని శాంట్నర్ అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ తమ బౌలర్ల ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నామని, పవర్ ప్లేలో వికెట్లు తీయలేకపోయిన ఆ తర్వాత వరుసగా వికెట్లు తీసి ఎక్కడా తగ్గకుండా పట్టుదలతో బౌలింగ్ చేశారని ప్రశంసించారు. ఇన్నింగ్స్ చివర్లో తమకు కొన్ని సానుకూల అంశాలు లభించాయని, వాటిని వెల్లింగ్టన్‌లో జరిగే రెండో వన్డేలో కొనసాగిస్తామని మిచెల్ శాంట్నర్ ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us