Abhishek Sharma : వరుసగా మూడు డకౌట్లు..హోటల్ నుంచి సీక్రెట్‌గా బయటకు వచ్చి గంభీర్‌తో కలిసి అభిషేక్ ఏం చేశాడంటే?

Abhishek Sharma : టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా సూపర్-8 పోరుకు సర్వం సిద్ధమైంది. నేడు (ఫిబ్రవరి 22) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సౌతాఫ్రికాతో భారత్ తలపడనుంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియాను ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ తీవ్రంగా వేధిస్తోంది.

Abhishek Sharma : వరుసగా మూడు డకౌట్లు..హోటల్ నుంచి సీక్రెట్‌గా బయటకు వచ్చి గంభీర్‌తో కలిసి అభిషేక్  ఏం చేశాడంటే?
Gautam Gambhir

Updated on: Feb 22, 2026 | 3:25 PM

Abhishek Sharma : టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా సూపర్-8 పోరుకు సర్వం సిద్ధమైంది. నేడు (ఫిబ్రవరి 22) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సౌతాఫ్రికాతో భారత్ తలపడనుంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియాను ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ తీవ్రంగా వేధిస్తోంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ అభిషేక్ కనీసం ఖాతా తెరవకుండానే (వరుసగా 3 డకౌట్లు) వెనుదిరిగాడు. దీంతో అతనిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో, సఫారీలతో మ్యాచ్‌కు కేవలం కొన్ని గంటల ముందు అభిషేక్ శర్మ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

సాధారణంగా మ్యాచ్ ఉన్న రోజు ఆటగాళ్లు హోటల్ గదులకే పరిమితమై మానసికంగా సిద్ధమవుతుంటారు. కానీ అభిషేక్ శర్మ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ కోచ్ గౌతమ్ గంభీర్‌తో కలిసి హోటల్ నుంచి బయటకు వచ్చాడు. వీరిద్దరూ ఒక నల్లటి ఎస్‌యూవీ కారులో నేరుగా స్టేడియానికి చేరుకున్నారు. అక్కడ అభిషేక్ కోసం ఒక ప్రత్యేకమైన ప్రైవేట్ ప్రాక్టీస్ సెషన్ ఏర్పాటు చేశారు. జట్టులోని మిగిలిన సభ్యులంతా విశ్రాంతి తీసుకుంటుంటే, ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఈ యువ ఓపెనర్ మాత్రం నెట్స్‌లో చెమటోడ్చాడు.

ఈ రహస్య ప్రాక్టీస్ సెషన్‌లో గంభీర్ పర్యవేక్షణలో అభిషేక్ కఠినంగా శ్రమించాడు. సుమారు 45 నిమిషాల పాటు జరిగిన ఈ సెషన్ మూడు భాగాలుగా సాగింది. దక్షిణాఫ్రికా బౌలర్లు వేసే రిబ్-లైన్ బౌలింగ్ (ఛాతీ ఎత్తులో వచ్చే బంతులు), రౌండ్-ది-వికెట్ ఆఫ్-స్పిన్‌ను ఎదుర్కోవడంపైనే అభిషేక్ ప్రధానంగా దృష్టి సారించాడు. స్థానిక బౌలర్ల సాయంతో మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. తన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పుంజుకోవడమే లక్ష్యంగా గంభీర్ అతనికి ప్రత్యేక సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ లో సిక్సర్ల సునామీ సృష్టించిన అభిషేక్ శర్మ, వరల్డ్ కప్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. అమెరికాపై ఆడిన తొలి మ్యాచ్‌లో ఎదుర్కొన్న మొదటి బంతికే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత దాయాది పాకిస్థాన్‌పై కూడా డకౌట్ అయి నిరాశపరిచాడు. ఇక నెదర్లాండ్స్‌పై మూడు బంతులు ఆడి మళ్ళీ సున్నాకే వెనుదిరిగాడు. వరుస వైఫల్యాలు ఎదురైనా టీమ్ మేనేజ్మెంట్ మాత్రం అతనికి అండగా నిలుస్తోంది. సౌతాఫ్రికా పై జరిగే నేటి మ్యాచ్‌లో అభిషేక్ తన సత్తా చాటి, విమర్శకుల నోళ్లు మూయించాలని పట్టుదలతో ఉన్నాడు.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Follow Us