Michael Clarke : అసిస్టెంట్‌తో అఫైర్..భార్యకు దొరికిపోయిన స్టార్ క్రికెటర్..విడాకుల కోసం రూ.300 కోట్లు సమర్పణ

Michael Clarke : క్రికెట్ మైదానంలో పరుగుల వరద పారించి, ఆస్ట్రేలియాకు ప్రపంచకప్‌ను అందించిన దిగ్గజ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ వ్యక్తిగత జీవితం మాత్రం ఒక విషాద మలుపు తిరిగింది. తన ఆటతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న క్లార్క్, ఒక చిన్న తప్పు వల్ల తన వైవాహిక జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా, ఏకంగా రూ.300 కోట్ల భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది.

Michael Clarke : అసిస్టెంట్‌తో అఫైర్..భార్యకు దొరికిపోయిన స్టార్ క్రికెటర్..విడాకుల కోసం రూ.300 కోట్లు సమర్పణ
Michael Clarke

Updated on: Jan 25, 2026 | 9:37 AM

Michael Clarke : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్, ఆ దేశపు ప్రముఖ సూపర్ మోడల్ కైలీ బోల్డీల పెళ్లి 2012లో అత్యంత వైభవంగా జరిగింది. క్రీడా, గ్లామర్ రంగాల్లో ఈ జంటను ఒక ఐడియల్ కపుల్‎గా చూసేవారు. క్లార్క్ క్రికెట్ ఆడుతున్నంత కాలం వీరి జీవితం చాలా సాఫీగా సాగింది. అయితే, 2015లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి క్లార్క్ రిటైర్ అయిన తర్వాత పరిస్థితులు నెమ్మదిగా మారడం మొదలయ్యాయి. ఖాళీ సమయం పెరగడం, కొత్త వ్యాపారాలు లేదా ఇతర వ్యాపకాల వల్ల క్లార్క్ తన అసిస్టెంట్‌తో సన్నిహితంగా ఉండటం ప్రారంభించారు.

హోటల్‌లో రెడ్ హ్యాండెడ్‌గా

క్లార్క్ తన అసిస్టెంట్‌తో అఫైర్ నడుపుతున్నారనే వార్తలు 2019లో ఆస్ట్రేలియా మీడియాలో గుప్పుమన్నాయి. మొదట్లో కైలీ దీనిని నమ్మకపోయినా, ఒకానొక సందర్భంలో క్లార్క్ తన అసిస్టెంట్‌తో కలిసి ఒక హోటల్ గదిలో ఉండగా కైలీ వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయిన కైలీ, తక్షణమే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది. 8 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక బంధం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

రూ.300 కోట్ల భారీ మూల్యం

2020లో వీరికి అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. అయితే, ఈ విడాకుల సెటిల్‌మెంట్ ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. కైలీకి భరణం కింద క్లార్క్ సుమారు 40 మిలియన్ అమెరికన్ డాలర్లు చెల్లించాల్సి వచ్చింది. దీని విలువ భారత కరెన్సీలో సుమారు రూ.300 కోట్లు. తన జీవితకాల కష్టార్జితంలో సగానికి పైగా మొత్తాన్ని క్లార్క్ ఇలా ఒక తప్పు వల్ల కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం వీరి కుమార్తె కైలీ వద్దే ఉంటోంది, అయితే కూతురి కోసం క్లార్క్, కైలీ ఇప్పటికీ అప్పుడప్పుడు కలుస్తూ స్నేహపూర్వకంగానే ఉంటున్నారు.

క్లార్క్ కెరీర్

వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా, క్రికెటర్‌గా క్లార్క్ రికార్డులు అమోఘం. ఆస్ట్రేలియా తరఫున 115 టెస్టుల్లో 8,643 పరుగులు సాధించాడు. ఇందులో 28 సెంచరీలు ఉన్నాయి. 245 వన్డేల్లో 7,981 పరుగులు చేసిన ఆయన, 2015లో ఆస్ట్రేలియాకు వన్డే వరల్డ్ కప్ అందించిన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో ఆయన అత్యధిక స్కోరు 329 (నాటౌట్). ఆటగాడిగా ఎంతో గౌరవం సంపాదించుకున్న క్లార్క్, తన అఫైర్ కారణంగా వ్యక్తిగత ప్రతిష్టను మాత్రం మసకబార్చుకున్నాడు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..