Mumbai Indians vs Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్‌లో ఈరోజు చివరి డబుల్ హెడర్ డే. మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ (MI) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య కొనసాగుతోంది. వాంఖడే స్టేడియంలో తొలుత టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు.
వాంఖడే స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన SRH 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. జట్టు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, వివ్రాంత్ శర్మ 140 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
మయాంక్ 83, వివ్రాంట్ 69 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో ఆకాశ్ మధ్వల్ 4 వికెట్లు తీశాడు. ముంబైకి అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. అదే సమయంలో, RCB కంటే మెరుగైన రన్ రేట్ కలిగి ఉండాలంటే 11.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాలి.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ ముందు 201 పరుగుల టార్గెట్ నిలిచింది.
మయాంక్ అగర్వాల్ 83 పరుగులు చేయగా, వివ్రాంత్ శర్మ 69 పరుగులతో అద్భుతంగా ఆకట్టుకున్నారు. ఆకాష్ మధ్వల్ 4 వికెట్లు, క్రిస్ జోర్డాన్ 1 వికెట్ తీశాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్, వివ్రాంత్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(కీపర్), హ్యారీ బ్రూక్, నితీష్ రెడ్డి, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, మయాంక్ డాగర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్.
SRH ఇంపాక్ట్ ప్లేయర్స్: మయాంక్ మార్కండే, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, అకేల్ హోసేన్, అబ్దుల్ సమద్.
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్.
MI ఇంపాక్ట్ ప్లేయర్స్: రమణదీప్ సింగ్, విష్ణు వినోద్. ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ, సందీప్ వారియర్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..