MI vs SRH Playing 11: టాస్ గెలిచిన ముంబై.. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఇలా జరగాల్సిందే..

Mumbai Indians vs Sunrisers Hyderabad Playing XI & Imapct Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఈ సీజన్‌లో ఈరోజు మళ్లీ డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది.

MI vs SRH Playing 11: టాస్ గెలిచిన ముంబై.. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఇలా జరగాల్సిందే..
Mi Vs Srh Playing Live

Updated on: May 21, 2023 | 3:15 PM

Mumbai Indians vs Sunrisers Hyderabad Playing XI & Imapct Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఈ సీజన్‌లో ఈరోజు మళ్లీ డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. కీలక మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ టీం.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ టీం ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

ఈ సీజన్‌లో ఇరు జట్లకు ఇదే చివరి లీగ్ దశ. ఈ సీజన్‌లో ఇరు జట్లు రెండోసారి తలపడనున్నాయి. ఇరు జట్లు ముఖాముఖి తలపడిన చివరి మ్యాచ్‌లో ముంబై 14 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది.

మరోవైపు బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (LSG) మధ్య రెండో మ్యాచ్ జరగనుంది.

ఇవి కూడా చదవండి

ముంబైకి భారీ విజయం అవసరం..

ముంబు ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేస్తే 180 పరుగులకు చేరుకుంటారనుకుంటే, వారి నెట్ రన్ రేట్ RCB కంటే మెరుగ్గా ఉండాలంటే దాదాపు 82 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. అలాగే మొదట బౌలింగ్ చేస్తే, టార్గెట్ 181 పరుగులుగా అనుకుంటే, ముంబై టీం దాపు 11.4 ఓవర్లలో ఛేదించవలసి ఉంటుంది.

ఈ సీజన్‌లో ముంబై ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఏడు మ్యాచ్‌లు గెలిచి ఆరు మ్యాచ్‌లు ఓడిపోయింది. జట్టుకు 14 పాయింట్లు ఉన్నాయి. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే జట్టు 80కి పైగా పరుగుల తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. అదే సమయంలో సాయంత్రం మ్యాచ్ గెలిచినా బెంగళూరు రన్ రేట్ తమను మించకూడదని కోవాల్సి ఉంటుంది.

హైదరాబాద్‌ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడగా నాలుగు మాత్రమే గెలిచింది . తొమ్మిది మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఈ జట్టు ఎనిమిది పాయింట్లు కలిగి ఉంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండటం ద్వారా ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది.

ఇరు జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్, వివ్రాంత్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(కీపర్), హ్యారీ బ్రూక్, నితీష్ రెడ్డి, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, మయాంక్ డాగర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్.

SRH ఇంపాక్ట్ ప్లేయర్స్: మయాంక్ మార్కండే, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, అకేల్ హోసేన్, అబ్దుల్ సమద్.

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్.

MI ఇంపాక్ట్ ప్లేయర్స్: రమణదీప్ సింగ్, విష్ణు వినోద్. ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ, సందీప్ వారియర్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..