MS Dhoni Fan: ధోనిపై అభిమానంతో ఇంటినే మార్చేశాడు.. అదే ఇంటిలో సూసైడ్.. కారణం ఏంటంటే?

MS Dhoni Fan Died in Tamil Nadu: గోపీ కృష్ణ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నప్పటికీ క్రికెట్ ప్రపంచకప్ సమయంలో భారత్‌కు తిరిగి వస్తాడు. అయితే, గోపీకృష్ణ ఎంతో కోరికతో డిజైన్ చేసిన ఇంట్లోనే గురువారం తెల్లవారుజామున ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న రామనాథం పోలీసులు అక్కడికి చేరుకుని గోపికృష్ణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తీటకుడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

MS Dhoni Fan: ధోనిపై అభిమానంతో ఇంటినే మార్చేశాడు.. అదే ఇంటిలో సూసైడ్.. కారణం ఏంటంటే?
Ms Dhoni Fan
Follow us
Venkata Chari

|

Updated on: Jan 19, 2024 | 1:09 PM

MS Dhoni Fan Died in Tamil Nadu: టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. రానున్న ఐపీఎల్ సీజన్‌ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఎంతోమందిని అభిమానులుగా మార్చుకున్న ఈ జార్ఖండ్ డైనమేట్.. మరోసారి మైదానంలో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఇంతలో ఓ వీరాభిమాని ఆత్మహత్య చేసుకున్న వార్త కలకలం రేపింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన గోపీ కృష్ణన్ (34) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడలూరు జిల్లా తిటకుడి సమీపంలోని అరంగుర్ గ్రామానికి చెందిన గోపీ.. తన ఇంటిలో తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో అటు కృష్ణన్ కుటుంబంతోపాటు, ధోని అభిమానులను విషాదంలో పడేసింది.

క్రికెటర్ ధోనీకి వీరాభిమాని అయిన గోపీ కృష్ణన్.. దుబాయ్‌లో పనిచేసేవాడు. 2020లో తన స్వగ్రామానికి తిరిగి వచ్చిన గోపీ.. ధోనిపై అభిమానంతో తన ఇంటికి పసుపు రంగు వేసి ప్రత్యేకమైన అభిమానం చాటుకున్నాడు. ధోనీ చిత్రాలతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును గోడపై పేయింటింగ్ చేయించాడు. ఈ క్రమంలో గోపీ ఇల్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ వరకు ఈ ఫొటోలు, వీడియోలు చేరాయి. ఈ క్రమంలో ధోని మాట్లాడుతూ, “నేను ఆ ఇంటి రూపాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూశాను. ఇది నా కోసమే కాదు. చెన్నై జట్టుపై, నాపై ప్రేమను వ్యక్తపరిచే చర్య అంటూ చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత తమిళనాడు రాష్ట్ర యువజనాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి గోపీకృష్ణ ఇంటికి వెళ్లి అభినందించారు. గోపికృష్ణ ఇంటికి పలువురు సినీ ప్రముఖులు, యువకులు, సామాన్యులు స్వయంగా వచ్చేవారు. ఇలా తన ప్రత్యేకతతో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు.

గోపీ కృష్ణ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నప్పటికీ క్రికెట్ ప్రపంచకప్ సమయంలో భారత్‌కు తిరిగి వస్తాడు. అయితే, గోపీకృష్ణ ఎంతో కోరికతో డిజైన్ చేసిన ఇంట్లోనే గురువారం తెల్లవారుజామున ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న రామనాథం పోలీసులు అక్కడికి చేరుకుని గోపికృష్ణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తీటకుడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

గోపికృష్ణ బంధువులు పోలీసులతో మాట్లాడుతూ.. “గోపికృష్ణతో పాటు అదే ఊరికి చెందిన కొంతమందికి ఆర్థిక వివాదాలు ఉన్నాయి. పొంగల్‌కు ముందు నిన్న జరిగిన క్రీడా పోటీల్లో ఇదే అంశం తెరపైకి వచ్చింది. దీంతో గోపీకృష్ణపై కొందరు దాడి చేశారు. మనస్థాపానికి గురైన గోపీ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. కాగా, మృతుడు గోపీకృష్ణకు భార్య అన్బరసి, 10, 8 ఏళ్ల కుమారులు ఉన్నారు. అలాగే 10 రోజుల క్రితం ఆడపిల్ల పుట్టింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..