
Carlos Brathwaite: ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగ్‌లు జరుగుతున్నాయి. వీటిలో Max60 కరేబియన్ లీగ్ ఒకటి. 60 బంతుల ఈ మ్యాచ్ అభిమానులకు వినోదాన్ని పంచుతోంది. ఈ లీగ్‌లో ఇప్పటికే లీగ్ దశ ముగిసింది. ఇప్పుడు సూపర్-3 రౌండ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ రౌండ్‌లో న్యూయార్క్ స్ట్రైకర్స్ వర్సెస్ గ్రాండ్ కేమన్ జాగ్వార్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. న్యూయార్క్ స్ట్రైకర్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ కార్లోస్ బ్రాత్‌వైట్ కోపంతో బంతికి బదులుగా తన హెల్మెట్‌ను బ్యాట్‌తో కొట్టి సిక్స్ పంపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్ గ్రాండ్ కేమాన్ జాగ్వార్ జోష్ లిటిల్ చేతిలో క్యాచ్ ఔట్ అయ్యాడు. అయితే, బ్రాత్‌వైట్ ప్రకారం బంతి అతని బ్యాట్‌కు తగలలేదు. అయితే బ్రాత్‌వైట్‌ను అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. అంపైర్ నిర్ణయంపై అసహనానికి గురైన బ్రాత్‌వైట్, బ్యాట్‌తో హెల్మెట్‌ను బలంగా కొట్టడంతో అది నేరుగా బౌండరీ వెలుపల పడింది.
Remember the name.. Carlos Brathwaite.. 😄pic.twitter.com/uTr7DNl0Bv
— Nibraz Ramzan (@nibraz88cricket) August 25, 2024
2016 టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ను ఛాంపియన్‌గా నిలిపింది కార్లోస్ బ్రాత్‌వైట్. కార్లోస్ బ్రాత్‌వైట్ ఫైనల్లో వరుసగా 4 సిక్సర్లు బాది ఇంగ్లండ్ విజయాన్ని దోచుకున్నాడు. కార్లోస్ బ్రాత్‌వైట్ తన అంతర్జాతీయ కెరీర్‌లో వెస్టిండీస్ తరపున 3 టెస్టులు, 44 వన్డేలు, 41 టీ20లు ఆడాడు. ఈ సమయంలో అతను 1050 పరుగులు, 75 వికెట్లు తీసుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..