Manish Pandey: భారీ సిక్సర్లతో అదరగొట్టిన మనీష్ పాండే.. ఫుల్ జోష్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్..

|

Mar 09, 2021 | 2:27 PM

Manish Pandey Wonders: టీమిండియా బ్యాట్స్‌మెన్ మనీష్ పాండే గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు దూరమైనా సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే..

Manish Pandey: భారీ సిక్సర్లతో అదరగొట్టిన మనీష్ పాండే.. ఫుల్ జోష్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్..
Follow us on

Manish Pandey Wonders: టీమిండియా బ్యాట్స్‌మెన్ మనీష్ పాండే గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు దూరమైనా సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకున్న పాండే.. తాజాగా జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టాడు. భారీ సిక్సర్లతో తన టీంను సెమీఫైనల్స్‌కు చేర్చాడు. కేరళతో జరిగిన క్వార్ట్‌ఫైనల్స్‌లో ఈ కర్ణాటక బ్యాట్స్‌మెన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడని చెప్పవచ్చు. ఆడిన ఇన్నింగ్స్ చిన్నదే అయినా.. టీమిండియా జట్టులోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇది సరిపోతుందని చెప్పాలి. అలాగే మనీష్ పాండే ఇన్నింగ్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ డగౌట్ కూడా ఫుల్ జోష్‌లో ఉంది.

20 బంతుల్లో 34 పరుగులు చేసిన మనీష్ పాండే..

కేరళతో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో మనీష్ పాండే 20 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 2 సిక్సర్లు, 1 ఫోర్‌ ఉన్నాయి. విజయ్ హజారే ట్రోఫీలో మనీష్ పాండే ఆడిన మొదటి మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ ద్వారా, అతను మరోసారి తన ఫామ్‌ను కంటిన్యు చేశాడు. ముఖ్యంగా కేరళ మ్యాచ్ చివరి ఓవర్‌లలో అతని బ్యాట్ నుండి వచ్చిన 34 పరుగులతో కర్ణాటక స్కోరు 338 పరుగులకు చేరింది.

ఇన్నింగ్స్ చిన్నదే అయినా.. సెలెక్టర్ల ఎంపికకు ఇది చాలు..

ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరగబోయే వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టు ఎంపిక కావాల్సి ఉంది. ఈ ఇన్నింగ్స్‌తో మనీష్ పాండే మళ్లీ సెలక్షన్ రేసులోకి వచ్చాడని చెప్పాలి. చూడాలి మరి సెలెక్టర్లు ఎంపిక చేస్తారో.! లేదో.!

మరిన్ని ఇక్కడ చదవండి:

Viral Video: భయంతో పరుగెత్తిన జింక.. వేటాడి.. వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి.. థ్రిల్లింగ్ వీడియో వైరల్.!

కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!

కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!