AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: 0,2,0,6,4.. టీ20ల్లో చెత్త రికార్డు.. సింగిల్ డిజిట్లకే చేతులెత్తేసిన బ్యాటర్లు..

బ్యాటర్లు ఆకాశమే హద్దుగా ఫోర్లు, సిక్సర్ల మోత మోగిస్తారు. ఈ టీ20 ఫార్మాట్‌లో బౌలర్లు కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించేవారు.

Cricket: 0,2,0,6,4.. టీ20ల్లో చెత్త రికార్డు.. సింగిల్ డిజిట్లకే చేతులెత్తేసిన బ్యాటర్లు..
Manipur Innings
Ravi Kiran
|

Updated on: Oct 19, 2022 | 12:00 PM

Share

సాధారణంగా టీ20 ఫార్మాట్‌ అంటే చాలు.. పరుగుల వరద పారుతుంది. బ్యాటర్లు ఆకాశమే హద్దుగా ఫోర్లు, సిక్సర్ల మోత మోగిస్తారు. ఈ ఫార్మాట్‌లో బౌలర్లు కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించేవారు. అయితే నిన్న జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో బ్యాటర్లకు పరుగులు చేయడం కష్టంగా మారింది. వెరిసి టీ20ల్లో చెత్త రికార్డు నమోదైంది. ఆ మ్యాచ్ భారత దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జరిగింది. ఈ టోర్నీలో మణిపూర్ పంజాబ్‌తో తలపడగా, తొలుత బ్యాటింగ్ చేసిన మణిపూర్ జట్టు కేవలం 40 పరుగులకే ఆలౌటైంది.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో నమోదైన రెండో అత్యల్ప స్కోర్ ఇది. అంతకముందు 20 అక్టోబర్ 2009న, త్రిపుర జట్టు కేవలం 30 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.

11లో ఒక్కరే టాప్ స్కోరర్.. మిగిలినవి సింగిల్ డిజిట్స్..

ఈ మ్యాచ్‌లో మణిపూర్‌ స్కోర్‌కార్డ్ చూస్తే, అందులో ఒక్కరు మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. రెక్స్ సింగ్ 23 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్ల సాయంతో 25 పరుగులు చేశాడు. ఇక మిగిలిన బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అందులోనూ ఐదుగురు ఖాతా కూడా తెరవలేదు.

మార్కండే స్పిన్‌కు మణిపూర్ విలవిల:

ఈ మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా మయాంక్ మార్కండే.. లెగ్ స్పిన్‌తో మాయాజాలం సృష్టించాడు. ఈ రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ 3.1 ఓవర్లలో నాలుగు పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అభిషేక్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, బల్తేజ్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్ ఒక్కో వికెట్ తీశారు. రమణదీప్ సింగ్ రెండు వికెట్లు తీశాడు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..

ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
శ్రేయస్‌కు నో ఛాన్స్.. 3వ స్థానంలో ఇషాన్ ఫిక్స్: సూర్యకుమార్
శ్రేయస్‌కు నో ఛాన్స్.. 3వ స్థానంలో ఇషాన్ ఫిక్స్: సూర్యకుమార్
27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలో శని.. ఈ రాశులవారికి జాక్‌పాట్
27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలో శని.. ఈ రాశులవారికి జాక్‌పాట్
వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!
SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే