RCB vs LSG Playing 11: టాస్ గెలిచిన లక్నో.. ఇరుజట్ల ప్లేయింగ్ XIలో కీలక మార్పులు..

|

Apr 10, 2023 | 7:21 PM

IPL 2023, Royal Challengers Bangalore vs Lucknow Super Giants: టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది. రెండు జట్లలోనూ చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.

RCB vs LSG Playing 11: టాస్ గెలిచిన లక్నో.. ఇరుజట్ల ప్లేయింగ్ XIలో కీలక మార్పులు..
Rcb Vs Lsg
Follow us on

Royal Challengers Bangalore vs Lucknow Super Giants: ఐపీఎల్ 2023లో భాగంగా 15వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగనుంది. గత సీజన్‌లో ఇరు జట్లు రెండుసార్లు ముఖాముఖి తలపడగా, రెండుసార్లు ఆర్‌సీబీ గెలిచింది. ఈ లీగ్‌లో లక్నోకు ఇది నాలుగో మ్యాచ్ కాగా, 2 విజయాలతో మూడో స్థానంలో నిలిచింది. కాగా, ఆర్‌సీబీకి ఇది మూడో మ్యాచ్‌. ఆర్సీబీ ఒక్క విజయంతో 7వ స్థానంలో ఉంది.

టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది. రెండు జట్లలోనూ చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇరు జట్లు:

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(కీపర్), జయదేవ్ ఉనద్కత్, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (కీపర్), అనుజ్ రావత్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..