IPL 2023: మినీ వేలంలో పేసర్లు, ఆల్‌రౌండర్లపైనే లక్నో కన్ను.. రిటైన్ చేసుకున్న రాహుల్‌ సేన ఇదే..

|

Nov 16, 2022 | 10:03 AM

మొదటి సీజన్‌లో దుమ్మురేపింది లక్నో సూపర్ జెయింట్స్. కెఎల్ రాహుల్ సారధ్యంలో ఈ జట్టు టాప్-4లో ఒకటిగా నిలిచింది..

IPL 2023: మినీ వేలంలో పేసర్లు, ఆల్‌రౌండర్లపైనే లక్నో కన్ను.. రిటైన్ చేసుకున్న రాహుల్‌ సేన ఇదే..
Lucknow Super Gaints
Follow us on

మొదటి సీజన్‌లో దుమ్మురేపింది లక్నో సూపర్ జెయింట్స్. కెఎల్ రాహుల్ సారధ్యంలో ఈ జట్టు టాప్-4లో ఒకటిగా నిలిచింది. సీనియర్ బ్యాటర్ల అనుభవం, పదునైన బౌలింగ్ లక్నో సొంతం. అలాగే ఈ జట్టులోని యువ ఆటగాళ్లు పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన సందర్భాలు లేకపోలేదు. వచ్చే ఐపీఎల్ 2023లో కచ్చితంగా ట్రోఫీ గెలవాలన్న ఆశతో.. మినీ వేలంలో పేసర్లు, ఆల్‌రౌండర్లే లక్ష్యంగా లక్నో సూపర్ జెయింట్స్ 7గురి ఆటగాళ్లను విడిచిపెట్టింది.

ఈ సీజన్‌లో లక్నో జట్టు పాయింట్ల పట్టికలో టాప్ 3లో నిలిచింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 5 ఓటములతో.. 18 పాయింట్లు సాధించింది. అయితే ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు చేతుల్లో ఓటమిపాలవ్వడంతో.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ జట్టు కెప్టెన్ కెఎల్ రాహుల్ టాప్ రన్ గెట్టర్‌(616)గా రెండో స్థానంలో, ఓపెనర్ డికాక్(508) మూడో స్థానంలో ఉన్నాడు.ఇక బౌలర్లలో ఆవేశ్ ఖాన్, మొహ్సిన్ ఖాన్, రవి బిష్ణోయ్‌ మంచి మార్కులు కొట్టేశారు. మరి లక్నో సూపర్ జెయింట్స్ రిలీజ్ చేసిన, రిటైన్ చేసిన ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూసేద్దాం..

రిలీజ్ ప్లేయర్స్: టై, అంకిత్ రాజ్‌పూత్, చమీరా, లెవిస్, హోల్డర్, పాండే, నదీమ్

రిటైన్ ప్లేయర్స్: కెఎల్ రాహుల్, అయుష్ బదోని, కరణ్ శర్మ, వోహ్ర, డికాక్, స్టోయినిస్, కృష్ణప్ప గౌతమ్, దీపక్ హూడా, మేయర్స్, పాండ్యా, ఆవేశ్ ఖాన్, మొహ్సిన్ ఖాన్, వుడ్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్

మిగిలిన మొత్తం: రూ 23.35 కోట్లు, ఓవర్సీస్ స్లాట్స్ – 4