Video: పగోడా, పనికిమాలినోడా.. రూ. 10 కోట్లతో SRH కొంపముంచావ్.. ఇప్పుడేమో 300 స్ట్రైక్ రేట్‌తో..

Abdul Samad Video: ఐపీఎల్ 2025లో అబ్దుల్ సమద్ రిషబ్ పంత్ కెప్టెన్సీలో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతున్నాడు. సమద్ లక్నో జట్టుకు ఫినిషర్ పాత్రను పోషిస్తున్నాడు. చివరి ఓవర్లో వచ్చి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడడంలో పేరుగాంచాడు. ఏప్రిల్ 19న కూడా ఇలాంటి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ కు వ్యతిరేకంగా బరిలోకి దిగిన అబ్దుల్ సమద్.. 10 బతుల్లోనే రాజస్థాన్‌కు చుక్కలు చూపించాడు.

Video: పగోడా, పనికిమాలినోడా.. రూ. 10 కోట్లతో SRH కొంపముంచావ్.. ఇప్పుడేమో 300 స్ట్రైక్ రేట్‌తో..
Abdul Samad

Updated on: Apr 20, 2025 | 10:53 AM

Abdul Samad: ఐపీఎల్ 2025లో భాగంగా ఏప్రిల్ 19, శనివారం డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరిగాయి. మొదటి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. ఇక రెండో మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగింది. లక్నో సూపర్ జెయింట్స్ రాజస్థాన్ రాయల్స్‌ను 2 పరుగుల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగా, రాజస్థాన్ జట్టు 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విధంగా రాజస్థాన్ వరుసగా నాలుగో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. లక్నో విజయంలో హీరో అవేష్ ఖాన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతను అద్భుతంగా బౌలింగ్ చేసి చివరి ఓవర్లో 9 పరుగులను విజయవంతంగా కాపాడుకున్నాడు. అతను తన 4 ఓవర్లలో 37 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్ తరపున యశస్వి జైస్వాల్ అత్యధికంగా 74 పరుగులు చేశాడు. కానీ, ఈ ఇన్నింగ్స్ జట్టు ఓటమిని ఆపలేకపోయింది.

మ్యాచ్‌ను మలుపు తిప్పిన అబ్దుల్ సమద్..

ఐపీఎల్ 2025లో అబ్దుల్ సమద్ రిషబ్ పంత్ కెప్టెన్సీలో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతున్నాడు. సమద్ లక్నో జట్టుకు ఫినిషర్ పాత్రను పోషిస్తున్నాడు. చివరి ఓవర్లో వచ్చి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడడంలో పేరుగాంచాడు. ఏప్రిల్ 19న కూడా ఇలాంటి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ కు వ్యతిరేకంగా బరిలోకి దిగిన అబ్దుల్ సమద్.. 10 బతుల్లోనే రాజస్థాన్‌కు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 17.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.

10 బంతుల్లో ఊచకోత..

లక్నో ఇన్నింగ్స్‌లో కేవలం 15 బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అప్పుడు సమద్ బ్యాటింగ్‌కు దిగి కేవలం 10 బంతుల్లో 4 సిక్సర్లతో 30 పరుగులు బాదేశాడు. చివరి ఓవర్లో ఈ నాలుగు సిక్సర్లు కొట్టడంతో.. ఇది మ్యాచ్‌ను పూర్తిగా మార్చేసింది. 19వ ఓవర్ వరకు లక్నో జట్టు 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. కానీ, సమద్ బాదిన 4 సిక్సర్ల కారణంగా, చివరి ఓవర్లో 27 పరుగులు వచ్చాయి. దీంతో లక్నో జట్టు 180 పరుగులు చేయగలిగింది. సమదర్ ఇన్నింగ్స్ ఆటను మార్చి వేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. లక్నో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ను 2 పరుగుల తేడాతో గెలుచుకుంది.

హైదరాబాద్ లో అలా.. లక్నో ఇలా..

గతంలో హైదరాబాద్ తరపున ఆడిన సమద్.. ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడు. 10 కోట్లతో కావ్య మారన్ ఏరి కోరి తెచ్చుకుంటే నట్టేట ముంచేశాడంటూ ఫ్యాన్స్ ఏకిపారేశారు. ఇక ప్రస్తుతం లక్నో తరపున ఆడుతోన్న సమద్.. చివరి ఓవర్లలో వచ్చి మ్యాచ్ స్వరూపాలనే మార్చేస్తున్నాడు. కేవలం రూ. 4.2 కోట్లకు లక్నోలో చేరిన సమద్, ఫినిషర్ గా వచ్చి ఎవ్వరూ ఊహించని రిజల్ట్ అందిస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ నువ్వు అసలు పగొడివా, పనికిమాలినోడివా అంటూ కామెంట్లు చేస్తున్నారు. చెత్త ఫాంతో హైదరాబాద్ జట్టు నుంచి తప్పించడంతో.. లక్నో తరపున ఆడుతూ పగ తీర్చుకుంటున్నట్లున్నాడని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..