
Lucknow Super Giants vs Punjab Kings, 13th Match: ఐపీఎల్ (IPL) 2025 లో 13వ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్‌కు 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
లక్నో జట్టు నుంచి నికోలస్ పూరన్ 44 పరుగులు, ఆయుష్ బడోని 41 పరుగులు చేశారు. ఐడెన్ మార్క్రమ్ 28 పరుగులు, అబ్దుల్ సమద్ 27 పరుగులు చేశారు. అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టాడు. లాకీ ఫెర్గూసన్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
పంజాబ్ కింగ్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, సూర్యాంశ్ షెడ్జ్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్, లాకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్.
లక్నో సూపర్ జెయింట్స్: రిషబ్ పంత్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, దిగ్వేష్ రాఠీ, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..