ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఈ సీజన్‌లో నేడు డబుల్ హెడర్ డే. లక్నో సూపర్‌జెయింట్స్ (LSG) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య మొదటి మ్యాచ్ లక్నోలోని భారతరత్న అటల్ విహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో మొదలైంది. గుజరాత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
నూర్ అహ్మద్ అరంగేట్రం చేస్తున్నాడు. రషీద్ ఖాన్ అతనికి తొలి క్యాప్ అందించాడు. అల్జారీ జోసెఫ్ స్థానంలో జట్టులోకి వచ్చాడు. లక్నోలో యుధ్వీర్ స్థానంలో అమిత్ మిశ్రా ప్లేయింగ్-11కి తిరిగి వచ్చాడు.
గుజరాత్ టైటాన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్.
ఇంపాక్ట్ ప్లేయర్స్: KS భరత్, జెషువా లిటిల్, జయంత్ యాదవ్, నూర్ అహ్మద్ మరియు దసున్ షనక.
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), ఆయుష్ బదోని, నవీన్ ఉల్ హక్, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్.
ఇంపాక్ట్ ప్లేయర్స్: కృష్ణప్ప గౌతమ్, జయదేవ్ ఉనద్కత్, డేనియల్ సైమ్స్, ప్రేరక్ మన్కడ్.
లక్నోపై గుజరాత్ గెలిస్తే, లక్నోపై ఇది వరుసగా మూడో విజయం అవుతుంది. మరోవైపు ఈరోజు ఇరు జట్లూ రంగంలోకి దిగనుండగా.. గత మ్యాచ్‌లో ఎదురైన ఓటమిని వదిలిపెట్టి మళ్లీ విజయ బాట పట్టేందుకు ప్రయత్నిస్తుంది.
ఇక రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) జట్లు తలపడనున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..