IPL 2022: ఉమ్రాన్‌, మొహ్సిన్‌ ఖాన్‌.. టీమ్‌ ఇండియా జెర్సీలో ముందుగా ఎవరో..?

|

May 19, 2022 | 3:58 PM

IPL 2022: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో 23 సిక్సర్లు, 31 ఫోర్లు, 40 ఓవర్లలో 418 పరుగులు నమోదయ్యాయి.

IPL 2022: ఉమ్రాన్‌, మొహ్సిన్‌ ఖాన్‌.. టీమ్‌ ఇండియా జెర్సీలో ముందుగా ఎవరో..?
Mohsin Khan
Follow us on

IPL 2022: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో 23 సిక్సర్లు, 31 ఫోర్లు, 40 ఓవర్లలో 418 పరుగులు నమోదయ్యాయి. కానీ ఒక ఫాస్ట్ బౌలర్ తన బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడే లక్నో సూపర్ జెయంట్స్‌కి చెందిన లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ మొహ్సిన్ ఖాన్. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్‌ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సెంచూరియన్ క్వింటన్ డి కాక్ ఎంపికయ్యాడు కానీ ఈ మ్యాచ్‌లో గెలిచిన అతిపెద్ద ఆటగాడు మొహ్సిన్ ఖాన్. కోల్‌కతాపై మొహ్సిన్ ఖాన్ 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మొహ్సిన్ ఈ ప్రదర్శన అందరి హృదయాలను గెలుచుకుంది. లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్ త్వరలో అతన్ని టీమ్ ఇండియాలో చూడాలని మాట్లాడాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన తొలి ఓవర్‌లోనే మొహ్సిన్ ఖాన్ వికెట్ తీశాడు. అతను అద్భుతమైన స్వింగ్‌తో వెంకటేష్ అయ్యర్‌ను ఔట్‌ చేశాడు. తర్వాత మరుసటి ఓవర్లో అభిజిత్ తోమర్ వికెట్ తీసుకున్నాడు. డెత్ ఓవర్‌లో కూడా మొహ్సిన్ తలవంచలేదు. ఆండ్రీ రస్సెల్ వికెట్‌ను తీసి కోల్‌కతా ఓటమిని నిర్ణయించాడు. మోహ్సిన్ ఎకానమీ రేటు ఓవర్‌కు 5 పరుగులు మాత్రమే కావడం గమనించదగ్గ విషయం.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ కూడా ఈ సీజన్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను 157 కిలోమీటర్లు వేగంతో బౌలింగ్‌ చేస్తున్నాడు. ఉమ్రాన్ పేరు మీద 21 వికెట్లు ఉన్నాయి కానీ అతని ఎకానమీ రేటు ఓవర్‌కు 8.93 పరుగులు. మరోవైపు మొహ్సిన్ 8 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు కానీ ఎకానమీ రేటు ఓవర్‌కు 6 పరుగులు మాత్రమే. స్పీడ్ గురించి చెప్పాలంటే మొహ్సిన్ ఖాన్ స్పీడ్ కూడా అద్భుతంగా ఉంది. కేకేఆర్‌పై మొహ్సిన్ 151 కిలోమీటర్లు వేగంతో బౌలింగ్‌ చేశాడు. అతిపెద్ద విషయం ఏంటంటే ఉమ్రాన్ కంటే మోహ్సిన్‌కు ఎక్కువ నియంత్రణ ఉన్నట్లు అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి