LPL 2024: ఎవడు మమ్మీ వీడు.! టీ20లకే అరవీర భయంకరుడు.. 18 బంతుల్లో మైండ్ బ్లోయింగ్ రికార్డు

|

Jul 06, 2024 | 4:58 PM

లంక ప్రీమియర్ లీగ్(ఎల్‌పీఎల్ 2024)లో మరో అరుదైన రికార్డు నమోదైంది. ఇటీవల జరిగిన ఓ మ్యాచ్‌లో న్యూజిలాండ్ వికెట్ కీపర్ టిం సీఫెర్ట్ అద్భుతమైన సెంచరీ సాధించడంతో పాటు.. టోర్నీలో తన పేరు మీద రెండు రికార్డులు నెలకొల్పాడు. దంబుల్లాలోని రాంగిరి అంతర్జాతీయ స్టేడియంలో..

LPL 2024: ఎవడు మమ్మీ వీడు.! టీ20లకే అరవీర భయంకరుడు.. 18 బంతుల్లో మైండ్ బ్లోయింగ్ రికార్డు
Lpl 2024
Follow us on

లంక ప్రీమియర్ లీగ్(ఎల్‌పీఎల్ 2024)లో మరో అరుదైన రికార్డు నమోదైంది. ఇటీవల జరిగిన ఓ మ్యాచ్‌లో న్యూజిలాండ్ వికెట్ కీపర్ టిం సీఫెర్ట్ అద్భుతమైన సెంచరీ సాధించడంతో పాటు.. టోర్నీలో తన పేరు మీద రెండు రికార్డులు నెలకొల్పాడు. దంబుల్లాలోని రాంగిరి అంతర్జాతీయ స్టేడియంలో గాలె మార్వెల్స్, జాఫ్నా కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జాఫ్నా కింగ్స్ బౌలర్ల ధాటికి గాలె మార్వెల్స్ తొలి 2 వికెట్లు 45 పరుగులకే కోల్పోయింది. ఈ దశలో వన్‌డౌన్‌లో దోగిన ఆ జట్టు బ్యాటర్ టిం సీఫెర్ట్.. మొదటి బంతి నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫలితంగా ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ మొత్తంగా 63 బంతులు ఎదుర్కుని 6 భారీ సిక్సర్లు, 12 ఫోర్లతో 104 పరుగులు చేశాడు. అతడి సెంచరీతో గాలె మార్వెల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.

ఇక 188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జాఫ్నా కింగ్స్‌కు కుశాల్ మెండిస్ పేలుడు ఆరంభాన్ని అందించాడు. మెండిస్ కేవలం 16 బంతుల్లోనే 30 పరుగులు చేయగా, మరో బ్యాటర్ రిలే రోసోవ్ 42 బంతుల్లో 3 సిక్సర్లు, 8 ఫోర్లతో 67 పరుగులు చేశాడు. మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారుతున్న సమయంలో అజ్మతుల్లా ఒమర్ జాహి కేవలం 13 బంతుల్లో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అతడు 2 భారీ సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో అజేయంగా 35 పరుగులు చేసి.. జాఫ్నా కింగ్స్‌కి 19.4 ఓవర్లలోనే అద్భుత విజయాన్ని అందించాడు.

సీఫెర్ట్ రికార్డు ఇది..

ఈ మ్యాచ్‌లో సీఫెర్ట్ సెంచరీ చేయడం ద్వారా.. టోర్నీలో శతక్కొట్టిన మొదటి విదేశీ నాన్-ఓపెనర్‌గా చరిత్ర సృష్టించాడు. అలాగే లంక ప్రీమియర్ లీగ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో బౌండరీల ద్వారా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా సీఫెర్ట్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో సీఫెర్ట్ సిక్సర్లు, ఫోర్ల సాయంతో 84 పరుగులు రాబట్టాడు. అంతకముందు కుశాల్ పెరీరా పేరిట ఈ రికార్డు ఉంది. అతడు బౌండరీల రూపంలో 70 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: సంతకం కింద రెండు చుక్కలు పెట్టే అలవాటు మీకుందా.? దీని అర్ధం ఏంటో తెల్సా

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..