Brian Lara: అతని ఐపీఎల్ కెరీర్ ముగిసినట్లే అనుకున్నారు.. అతని అదృష్టాన్ని మార్చిన ఘనత కోహ్లీదే..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 14 పాయింట్లతో జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. మరో మ్యాచ్ గెలిస్తే ఫ్లే ఆఫ్‌కు చేరేందుకు జట్టుకు అవకాశాలు మెరుగవుతాయి. ఈ సీజన్లో బెంగళూరు ఆటగాళ్లు బాగా రాణిస్తున్నారు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్షల్ పటేల్ హ్యాట్రిక్ వికెట్లు తీసి అదరగొట్టాడు. విరాట్ కోహ్లీ సూపర్‌గా బ్యాటింగ్ చేసి జట్టుకు శుభారంభం అందించారు. చివర్లో మాక్స్వెల్ బ్యాట్ ఝుళింపిచడంతో బెంగళూరు భారీ స్కోర్ చేయగలిగింది. మాక్స్వెల్ 50 పరుగులు చేశారు. ఐపీపీఎల్-2021 రెండో దశలో మాక్స్వెల్ రెండు అర్థసెంచరీలు చేశాడు. మాక్స్వెల్ అసాధారణమైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున గతేడాది 13 మ్యాచులు ఆడిన మాక్సీ 108 పరుగులు మాత్రమే చేశాడని.. ఆర్సీబీ జట్టులో చేరిన తర్వాత మెరుగయ్యాడని వెస్టిండీస్ మాజీ ఆటగాడు బ్రియాన్ లారా అన్నారు. ఈ సిజన్లో మాక్స్వెల్ నాలుగు అర్థసెంచరీలు చేశాడని చెప్పాడు. ఆస్ర్టేలియా బ్యాట్స్‌మన్ అదృష్టాన్ని మార్చిన ఘనత కోహ్లీదేనని లారా అన్నారు. 2019, 2020ఐపీఎల్లో మాక్సీ పేలవమైన ఆటతీరు కనబర్చాడు. అతని ఐపీఎల్ కెరీర్ ముగినట్లే అంత అనుకున్నారని బ్రియాన్ చెప్పారు. ఆర్సీబీలో చేరమని మాక్స్‌వెల్‌కు విరాట్ కోహ్లీ నుంచి పిలుపు వచ్చింది. మాక్సీ బాగా ఆడతాడని మీరు ఊహించగలరా. కానీ కోహ్లీ విశ్వసించాడని చెప్పారు. కోహ్లీ ప్రోత్సాహం వల్లే మాక్సీలో ఆత్మవిశ్వాసం ఏర్పడి బాగా ఆడుతున్నారని చెప్పారు. ఇది ఆటగాడికి అవసరమన్నారు.
ఐపీఎల్ 2021 ఆటగాళ్ల వేలం సమయంలో మాక్సీ కోసం ఆర్సీబీ, సీఎస్కే మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడంది. చివరికి మాక్స్‌వెల్‌ను 14.25 కోట్లు వెచ్చించి అర్సీబీ దక్కించుకుంది. ఇదీ పెద్ద మొత్తం అనిపించినప్పటికీ అతని ఆట ముందు, ఆర్సీబీ రావటం కన్నా చిన్నదేనని అభిప్రాయపడ్డారు.