Video: సూపర్ ఓవర్‌లో పరుగుల సునామీ.. 3 ఫోర్లు, 3 సిక్సులు.. 500 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. వైరల్ వీడియో..

|

Jun 27, 2023 | 11:17 AM

ICC world Cup Qualifiers 2023: ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో వెస్టిండీస్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్ కనిపించింది. ఈ సూపర్‌ ఓవర్‌లో నెదర్లాండ్స్‌ వాన్‌ బీక్‌ అద్భుతం చేశాడు.

Video: సూపర్ ఓవర్‌లో పరుగుల సునామీ.. 3 ఫోర్లు, 3 సిక్సులు.. 500 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. వైరల్ వీడియో..
Logan Van Beek Video
Follow us on

Logan Van Beek 30 Runs In One Over: ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఎంతో ఆసక్తిగా సాగుతున్నాయి. పసికూనలైన జట్లు.. ప్రపంచ విజేతలకు ముచ్చెమటలు పట్టించాయి. టార్గెట్‌గా భారీ స్కోర్లు ఇచ్చినా.. ఇసుమంత కూడా భయానికి చోటు లేకుండా ఛేదిస్తున్నాయి. ఇక తాజాగా నెదర్లాండ్స్ జట్టు సూపర్ ఓవర్‌లో రెండుసార్లు ప్రపంచ కప్ విజేత వెస్టిండీస్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 374 పరుగులు చేసింది. దీంతో నెదర్లాండ్స్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 374 పరుగులు చేసి మ్యాచ్‌ని టై చేసుకుంది. దీని తర్వాత నెదర్లాండ్స్‌కు చెందిన వాన్ బీక్ సూపర్ ఓవర్‌లో తుఫాను ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు.

సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు 30 పరుగులు బాదేసింది. వెస్టిండీస్ బౌలర్ జాసన్ హోల్డర్‌పై నెదర్లాండ్స్ జట్టు అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ వాన్ బీక్ 3 సిక్సర్లు, 3 ఫోర్లతో తాట తీశాడు. ఒకే ఓవర్లో వాన్ బీక్ కొట్టిన ఇన్నింగ్స్ వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

తొలి బంతికే వాన్ బీక్ ఫోర్ కొట్టినట్లు వీడియోలో చూడొచ్చు. ఆ తర్వాత, రెండో బంతికి ఫుల్ టాస్ వచ్చింది. దీనిపై బీక్ సిక్స్ కొట్టాడు. తర్వాత మూడో బంతికి బెక్ మరో ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత నాలుగో బంతిని బీక్ బౌండరీ లైన్ దాటి సిక్సర్ కొట్టాడు. అదే సమయంలో ఐదో బంతికి సిక్సర్, ఆరో బంతికి ఫోర్ బాదాడు. దీంతో సూపర్ ఓవర్‌లో నెదర్లాండ్స్ 30 పరుగులు సాధించింది. అది కూడా వాన్ బీక్ ఒక్కడే అన్ని బంతులు ఆడి ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు.

31 పరుగుల ఛేదనకు దిగిన వెస్టిండీస్ జట్టు 5 బంతుల్లో 2 వికెట్లు కోల్పోయి 8 పరుగులు మాత్రమే చేయగలిగింది. నెదర్లాండ్స్ తరపున బ్యాటింగ్ చేసిన వాన్ బీక్.. ఆ తర్వాత బౌలింగ్ కూడా చేశాడు. అంటే సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో నెదర్లాండ్స్‌కు వాన్ బీక్ అద్భుతాలు చేశాడు.

ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల నుంచి సెంచరీలు..

ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల నుంచి సెంచరీలు కనిపించడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌లో నికోలస్ పూరన్ 65 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 104 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నెదర్లాండ్స్‌కు చెందిన తేజ నిడమనూరు 76 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 111 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..