LLC 2023: లెజెండ్స్ లీగ్‌ క్రికెట్‌ ఛాంపియన్‌గా మణిపాల్‌ టైగర్స్‌.. ఫైనల్‌లో రైనా టీమ్‌పై హర్భజన్‌ జట్టు ఘన విజయం

లెజెండ్స్‌ క్రికెట్‌లీగ్‌ ఛాంపియన్‌గా హర్భజన్‌ సింగ్‌ నేతృత్వంలోని మణిపాల్‌ టైగర్స్‌ టీమ్‌ ఛాంపియన్‌గా నిలిచింది. సూరత్‌లోని లాల్‌భాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఆజట్టు 5 వికెట్ల తేడాతో సురేశ్‌ రైనా సారథ్యంలోని అర్బన్ రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. రైన్‌ జట్టు విధించిన 188 పరుగుల లక్ష్యాన్ని మణిపాల్‌ టైగర్స్‌ వికెట్లు కోల్పోయి ఛేదించింది.

LLC 2023: లెజెండ్స్ లీగ్‌  క్రికెట్‌ ఛాంపియన్‌గా మణిపాల్‌ టైగర్స్‌.. ఫైనల్‌లో రైనా టీమ్‌పై హర్భజన్‌ జట్టు ఘన విజయం
Legends League Cricket 2023

Updated on: Dec 10, 2023 | 6:38 AM

లెజెండ్స్‌ క్రికెట్‌లీగ్‌ ఛాంపియన్‌గా హర్భజన్‌ సింగ్‌ నేతృత్వంలోని మణిపాల్‌ టైగర్స్‌ టీమ్‌ ఛాంపియన్‌గా నిలిచింది. సూరత్‌లోని లాల్‌భాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఆజట్టు 5 వికెట్ల తేడాతో సురేశ్‌ రైనా సారథ్యంలోని అర్బన్ రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. రైన్‌ జట్టు విధించిన 188 పరుగుల లక్ష్యాన్ని మణిపాల్‌ టైగర్స్‌ వికెట్లు కోల్పోయి ఛేదించింది. సేల గుణరత్నే 29 బంతుల్లో 5 భారీ సిక్సర్లతో అజేయంగా 51 పరుగులు చేసి ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్ రాబిన్ ఉతప్ప (40) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో మణిపాల్ టైగర్స్ కెప్టెన్ హర్భజన్ సింగ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఇన్నింగ్స్ ప్రారంభించిన అర్బన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు శుభారంభం లభించలేదు. ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (0), డ్వేన్ స్మిత్ (21) ఆరంభంలోనే వికెట్లను పారేసుకున్నారు. ఈ దశలో బరిలోకి దిగిన రికీ క్లర్క్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభం నుంచి ఫాస్ట్ బ్యాటింగ్‌పై దృష్టిపెట్టిన రికీ క్లర్క్ 52 బంతుల్లో 4 భారీ సిక్సర్లు, 6 ఫోర్లతో అజేయంగా 80 పరుగులు చేశాడు. మరోవైపు మంచి సహకారం అందించిన గురుకీరత్ సింగ్ 36 బంతుల్లో 2 సిక్సర్లు, 8 ఫోర్లతో 64 పరుగులు చేశాడు. దీంతో అర్బన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. మణిపాల్ బౌలర్లలో పంకజ్‌ సింగ్‌ 2 వికెట్లు తీసుకోగా, థిసారా పెరీర్‌ ఒక వికెట్‌ తీశాడు.

188 పరుగుల కఠిన లక్ష్యంతో బరిలోకి దిగిన మణిపాల్ టైగర్స్ జట్టుకు ఓపెనర్ రాబిన్ ఉతప్ప (40), చాడ్విక్ వాల్టన్ (29) శుభారంభం అందించారు. ఆ తర్వాత ఏంజెలో పెరీరా 30 పరుగులు చేశాడు. తిసార పెరీరా 25 పరుగులు చేయగా, అసేల గుణరత్నే 29 బంతుల్లో 5 భారీ సిక్సర్లతో అజేయంగా 51 పరుగులు చేశాడు. దీంతో మణిపాల్ టైగర్స్ జట్టు 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

అర్బన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11:

మార్టిన్ గప్టిల్, డ్వేన్ స్మిత్, రికీ క్లార్క్, గురుకీరత్ సింగ్ మాన్, సురేష్ రైనా (కెప్టెన్), పీటర్ ట్రెగో, స్టువర్ట్ బిన్నీ, అస్గర్ ఆఫ్ఘన్, అమిత్ పౌనికర్ (వికెట్ కీపర్), జెరోమ్ టేలర్, క్రిస్ ఎంఫోఫు.

మణిపాల్ టైగర్స్ ప్లేయింగ్ 11:

చాడ్విక్ వాల్టన్, రాబిన్ ఉతప్ప (వికెట్ కీపర్), అమిత్ వర్మ, ఏంజెలో పెరీరా, అసేల గుణరత్నే, తిసార పెరీరా, పంకజ్ సింగ్, అమితోజ్ సింగ్, హర్భజన్ సింగ్ (కెప్టెన్), ప్రవీణ్ గుప్తా, మిచెల్ మెక్‌క్లెనాఘన్.

మొదటి సారి ఛాంపియన్ గా..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..