
IND vs AUS 1st T20I: గురువారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. ప్రపంచకప్ తర్వాత సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే, మ్యాచ్‌కు ఒక రోజు ముందు, అంటే బుధవారం, సూర్యకుమార్ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఇప్పుడు మనకు కొత్త ప్రారంభం కావాలి. నిర్భయ క్రికెట్ ఆడతాం. ప్రపంచకప్ ఫైనల్‌లో ఓడిపోయినప్పటికీ, టోర్నీలో మేం ప్రదర్శన ఇచ్చామని, అందుకు గర్వపడుతున్నామని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.
సూర్య మాట్లాడుతూ, నేను యువ ఆటగాళ్లతో మాట్లాడి, ముందు జట్టు కోసం ఆడాలి. ఆపై మన గురించి మనం ఆలోచించాలని చెబుతాను. రోహిత్ శర్మ నిర్భయ బ్యాటింగ్ మనందరినీ ఆకట్టుకుంది. అతను ఒక నాయకుడు, మేం ఇప్పుడు T20 లో అదే ఆట ఆడతాం అంటూ తెలిపాడు.
ఇప్పుడు T20 ప్రపంచ కప్‌నకు ప్రతి T20 క్రికెట్ గేమ్ ముఖ్యమని సూర్యకుమార్ అన్నాడు. జట్టుకు నా సందేశం చాలా స్పష్టంగా ఉంది. నిర్భయంగా ఉండండి. జట్టుకు సహాయం చేయడానికి ఏమైనా చేయండి అంటూ సూచించాడు.
భారత యువ ఆటగాళ్లకు ఇదో పెద్ద సవాల్ అని సూర్యకుమార్ అన్నాడు. అయితే, యువ ఆటగాళ్లు ఐపీఎల్‌లో కూడా అద్భుతంగా ఆడుతున్నారు. ఇటీవల దేశవాళీ క్రికెట్‌ను కూడా ఆడారు. ఆటగాళ్లందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆటగాళ్లు ఆటను ఆస్వాదించాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నాడు.
🚨 NEWS 🚨#TeamIndia’s squad for @IDFCFIRSTBank T20I series against Australia announced.
Details 🔽 #INDvAUShttps://t.co/2gHMGJvBby
— BCCI (@BCCI) November 20, 2023
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య చివరి T-20 సిరీస్ సెప్టెంబర్ 2022లో భారతదేశంలో జరిగింది. ఆ తర్వాత 3వ టీ20 సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈసారి 5 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. నవంబర్ 23, 26, 28 తేదీల్లో, అలాగే, డిసెంబర్ 1, 3 తేదీలలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి.
2021 తర్వాత జట్టుకు సారథ్యం వహించే 9వ ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. గతంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రా కెప్టెన్‌లుగా వ్యవహరించారు.
టీ20 సిరీస్ కోసం భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..