Legends League: 69 బంతుల్లో 140 పరుగులు చేసిన మాజీ వికెట్ కీపర్.. అయినా ఓడిపోయినా ఇండియా మహారాజా

లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో నమన్ ఓజా భారీ సెంచరీ సాధించాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. కానీ..

Legends League: 69 బంతుల్లో 140 పరుగులు చేసిన మాజీ వికెట్ కీపర్.. అయినా ఓడిపోయినా ఇండియా మహారాజా
Ojha

Updated on: Jan 23, 2022 | 9:56 AM

లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో నమన్ ఓజా భారీ సెంచరీ సాధించాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. కానీ అతడి సెంచరీ జట్టును గెలిపించలేకపోయింది. లెజెండ్స్ లీగ్​లో ఇండియా మహారాజా, వరల్డ్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా మహారాజా 20 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగులు చేసింది. 210 పరుగుల లక్ష్యాన్ని ప్రపంచ జెయింట్స్‌ 19.3 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి ఛేదించింది. లీగ్ ఆఫ్ లెజెండ్స్‌లో ఇది ఇండియా మహారాజాకు తొలి ఓటమి కాగా వరల్డ్ జెయింట్స్‌కు తొలి విజయం.

ఇండియా మహారాజా తరఫున నమన్ ఓజా 69 బంతుల్లో 140 పరుగులు చేశాడు. భారత మాజీ వికెట్ కీపర్ తన ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 9 సిక్సర్లు కొట్టాడు. భారత మహారాజా బౌలర్లు నిర్ణీత వ్యవధిలో వరల్డ్ జెయింట్స్ వికెట్లను పడగొట్టారు. కానీ ఓటమి నుంచి జట్టును కాపాడలేకపోయాడు. వరల్డ్ జెయింట్స్ ఆటగాడు ఇమ్రాన్ తాహిర్ తన ఆట వరల్డ జెయింట్స్​ను గెలిపించాడు. 42 ఏళ్ల ఇమ్రాన్ తాహిర్ 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 52 పరుగులు చేసిని అజేయంగా నిలిచాడు.

Read Also.. Watch Video: ‘శ్రీవల్లీ’ పాటకు చిందులేసిన సురేష్ రైనా.. బ్యాటింగ్‌ స్టెప్స్ అదరహో అంటోన్న ఫ్యాన్స్..!