Test Wickets Record: ముత్తయ్య మురళీధరన్ రికార్డును బ్రేక్ చేయడం ఇక అసాధ్యమేనా?

|

Sep 10, 2024 | 1:04 PM

టెస్ట్ క్రికెట్‌ భవితవ్యంపై శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన రికార్డు ముత్తయ్య (800 వికెట్లు) పేరట ఉంది. సమీప భవిష్యత్తులో తన టెస్ట్ రికార్డును మరో బౌలర్ బ్రేక్ చేస్తాడని తాను భావించడం లేదని తెలిపాడు. దీనికి కారణాలను కూడా విశ్లేషించాడు. ప్రస్తుత ఆటగాళ్లందరూ షార్ట్ ఫార్మెట్ క్రికెట్‌పైనే ఫోకస్ చేస్తున్నారని గుర్తుచేశాడు.

Test Wickets Record: ముత్తయ్య మురళీధరన్ రికార్డును బ్రేక్ చేయడం ఇక అసాధ్యమేనా?
Muttiah Muralitharan
Follow us on

టెస్ట్ క్రికెట్‌ భవితవ్యంపై శ్రీలంక దిగ్గజ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన రికార్డు ముత్తయ్య (800 వికెట్లు) పేరట ఉంది. సమీప భవిష్యత్తులో తన టెస్ట్ రికార్డును మరో బౌలర్ బ్రేక్ చేస్తాడని తాను భావించడం లేదని తెలిపాడు. దీనికి కారణాలను కూడా విశ్లేషించాడు. ప్రస్తుత ఆటగాళ్లందరూ షార్ట్ ఫార్మెట్ క్రికెట్‌పైనే ఫోకస్ చేస్తున్నారని గుర్తుచేశాడు. తన రికార్డును బ్రేక్ చేసేలా బౌలర్లు ఎవరూ టెస్ట్ క్రికెట్‌లో సుదీర్ఘ కాలం కెరీర్‌ కొనసాగించడం లేదన్నాడు. అప్పట్లో తాను క్రికెట్ కెరీర్‌ను 20 ఏళ్లు కొనసాగించని గుర్తుచేశాడు. అయితే ప్రస్తుతం ఆటగాళ్ల కెరీర్ కొన్నేళ్లలోనే ముగిసిపోతోందని అన్నాడు. అందుకే 800 వికెట్ల రికార్డు బ్రేక్ కావడం అయ్యేపనికాదన్నాడు.

అదే సమయంలో టెస్ట్ క్రికెట్ భవిష్యత్తు మురళీధరన్ ఆందోళన వ్యక్తంచేశాడు. చాలా దేశాల్లో టెస్ట్ క్రికెట్‌ వీక్షకుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోందన్నాడు. ఆంగ్ల పత్రిక డైలీ మెయిల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముత్తయ్య మురళీధరన్ ఈ కామెంట్స్ చేశాడు. దాదాపు అన్ని దేశాలు ఏడాదికి కేవలం ఆరేడు టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడుతున్నాయని మురళీధరన్ గుర్తుచేశాడు. టెస్ట్ క్రికెట్ పట్ల అభిమానుల్లో ఆసక్తి తగ్గిపోవడం తనను ఆవేదనకు గురిచేస్తున్నట్లు చెప్పాడు.

ముత్తయ్య మురళీధరన్ రికార్డుకు దగ్గర్లో ప్రస్తుతం ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లైయన్ (530 వికెట్లు), భారత స్పిన్నర్ రవీంద్రన్ అశ్విన్ (516) ఉన్నారు. ప్రస్తుతం నాథన్ లైయన్‌కు 36 ఏళ్లు కాగా.. రవీంద్రన్ అశ్విన్ వయస్సు 37 ఏళ్లు. రిటైర్మెంట్‌కు ముందు వీరిద్దరూ ముత్తయ్య మురళీధరన్ రికార్డును బ్రేక్ చేయడం సాధ్యంకాకపోవచ్చు. 30 ఏళ్ల కంటే తక్కువ వయస్సులో దక్షిణాఫ్రికాకు చెందిన కగిసో రబడా అత్యధిక టెస్ట్ వికెట్లు (299) సాధించిన ఆటగాడిగా ఉన్నాడు.

ఇంగ్లండ్ – శ్రీలంక మధ్య ముగిసిన టెస్ట్ సిరీస్‌ను అతిథ్య ఇంగ్లండ్ 2-1 తేడాతో గెలుచుకుంది. చివరి టెస్ట్ మ్యాచ్‌ను శ్రీలంక జట్టు 8 వికెట్ల తేడాతో గెలుచుకుంది.