ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ బీసీసీఐని తప్పుబట్టారు. ఐపీఎల్లో చేరిన రెండు కొత్త జట్ల యజమానుల్లో ఒకరిపై మంగళవారం తీవ్రమైన ఆరోపణలు చేశారు. “బెట్టింగ్ కంపెనీలు కూడా జట్టును కొనుగోలు చేయవచ్చు” అని అన్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) సోమవారం ఆర్పీఎస్జీ వెంచర్స్ లిమిటెడ్, Irelia Company Pte Ltd. (CVC Capital Partners)ని 2022 నుంచి కొత్త IPL జట్లకు యజమానులుగా ప్రకటించింది. RPSG గ్రూప్ భారీ మొత్తంలో రూ.7,090 చెల్లించి లక్నో ఫ్రాంచైజీని సొంతం చేసుకుంది. CVC క్యాపిటల్ రూ. 5,600 కోట్లు వెచ్చించి అహ్మదాబాద్ ఫ్రాంచైజీని చేజెక్కించుకుంది. కొత్త జట్లపై బీసీసీఐ ప్రకటన చేసిన వెంటనే లలిత్ మోడీ బీసీసీఐపై విరుచుకుపడ్డారు.
“బెట్టింగ్ కంపెనీలు IPL జట్టును కొనుగోలు చేయవచ్చని నేను ఊహిస్తున్నాను. తప్పనిసరిగా కొత్త నియమం ఉండాలి. ఒక అర్హత కలిగిన బిడ్డర్ కూడా ఒక పెద్ద బెట్టింగ్ కంపెనీని కలిగి ఉన్నాడు. తర్వాత ఏమి చేయాలి? బీసీసీఐ సరిగ్గా హోంవర్క్ చేయదు? అటువంటి సందర్భంలో అవినీతి నిరోధక శాఖ ఏమి చేయగలదు? అంటూ ట్వీట్ చేశారు. కొత్త జట్ల ఎంపికలో సరైన విచారణ చేయకుండానే ప్రకటించారని అన్నారు. లలిత్ మోడీ ట్వీట్ తర్వాత, సీవిసీ క్యాపిటల్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కంపెనీలలో భారీగా పెట్టుబడులు పెట్టిందని ఔట్లుక్ నివేదిక నివేదిక పేర్కొంది. CVC ఆర్థిక కార్యాకలాపాలను బీసీసీఐ గుర్తించకపోవడం విచిత్రంగా ఉందన్నారు.
i guess betting companies can buy a @ipl team. must be a new rule. apparently one qualified bidder also owns a big betting company. what next ??? – does @BCCI not do there homework. what can Anti corruption do in such a case ? #cricket
— Lalit Kumar Modi (@LalitKModi) October 26, 2021
Read Also.. Ind Vs Pak: హర్భజన్ సింగ్, మహ్మద్ అమీర్ మధ్య ట్విట్టర్ వార్.. పాత వీడియోలు పోస్టు చేస్తున్న మాజీ ఆటగాళ్లు..