Video: కెప్టెన్‌కి బహుమతిగా గోల్డ్ ఐఫోన్.. కట్‌చేస్తే.. ఎత్తుకెళ్లిన తోటి ప్లేయర్

Shaheen Afridi: ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిది ఆకట్టుకుంటున్నాడు. అతని నాయకత్వంలోని ఈ ఎడమచేతి వాటం పేసర్ టీం, ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లను గెలిచి లీగ్ పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచింది. షాహీన్ అఫ్రిది లీగ్‌లో బంతితోనూ సత్తా చాటుతున్నాడు. లాహోర్ ఖలందర్స్ కెప్టెన్ లీగ్‌లో తాను ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 5 వికెట్లు పడగొట్టాడు. కరాచీ కింగ్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ప్రత్యర్థిని 65 పరుగుల తేడాతో ఓడించింది.

Video: కెప్టెన్‌కి బహుమతిగా గోల్డ్ ఐఫోన్.. కట్‌చేస్తే.. ఎత్తుకెళ్లిన తోటి ప్లేయర్
24k Gold Iphone

Updated on: Apr 22, 2025 | 11:39 AM

PSL 2025: ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2025 సందర్భంగా లాహోర్ ఖలందర్స్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది తన జట్టు తరపున ఒక ప్రత్యేక బహుమతిని అందుకున్నాడు. లీగ్‌లోని మ్యాచ్‌ల తర్వాత కరాచీ కింగ్స్ తమ ఆటగాళ్లకు ప్రత్యేకమైన బహుమతులతో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, లాహోర్ ఖలందర్స్ ఒక అడుగు ముందుకు వేసి తమ కెప్టెన్ షాహీన్ అఫ్రిదికి అద్భుతమైన బహుమతిని అందించింది. ఎడమచేతి వాటం పేసర్ కస్టమైజ్డ్ 24 క్యారెట్ల బంగారు పూత పూసిన ఐఫోన్ 16 ప్రోను అందుకున్నాడు. అయితే, ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

ఈ వీడియోను లాహోర్ ఖలందర్స్ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. చివర్లో తోటి ప్లేయర్ ఈ బహుమతితో మైదానం నుంచి బయటకు వెళ్తూ “యే హెవీ హై (ఇది హెవీ)” అని చెప్పడం చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

అక్కడే ఉన్న హారిస్ రవూఫ్ తన అసూయను వ్యక్తం చేస్తూ, “లేదు సోదరా, ఇది అన్యాయం” అంటూ చెప్పడం చూడొచ్చు.

ఈ వీడియోను లాహోర్ ఖలందర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “ఐఫోన్ వచ్చింది. మా కెప్టెన్ అద్భుతమైన బహుమతిని అందుకున్నాడు. లాహోర్ ఖలందర్స్ కెప్టెన్ షాహీన్ కోసం తయారు చేసిన కస్టమైజ్డ్ 24K బంగారు పూతతో కూడిన ఐఫోన్ 16 ప్రో!” అనే శీర్షికతో ఈ వీడియోను పోస్ట్ చేశారు.

వీడియో ఇక్కడ చూడండి:

ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిది ఆకట్టుకుంటున్నాడు. అతని నాయకత్వంలోని ఈ ఎడమచేతి వాటం పేసర్ టీం, ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లను గెలిచి లీగ్ పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచింది.

షాహీన్ అఫ్రిది లీగ్‌లో బంతితోనూ సత్తా చాటుతున్నాడు. లాహోర్ ఖలందర్స్ కెప్టెన్ లీగ్‌లో తాను ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 5 వికెట్లు పడగొట్టాడు. కరాచీ కింగ్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ప్రత్యర్థిని 65 పరుగుల తేడాతో ఓడించింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..